Karnataka assembly election : జేడీఎస్ చీలిపోతుంది.. పొత్తు అవకాశాలు లేవు.. : కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-05-12T20:29:19+05:30 IST

కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు (Karnataka assembly election results) వెలువడిన తర్వాత జేడీఎస్ పార్టీ చీలిపోతుందని కాంగ్రెస్

Karnataka assembly election : జేడీఎస్ చీలిపోతుంది.. పొత్తు అవకాశాలు లేవు.. : కాంగ్రెస్
Jairam Ramesh, Congress

న్యూఢిల్లీ : కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు (Karnataka assembly election results) వెలువడిన తర్వాత జేడీఎస్ పార్టీ చీలిపోతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) జోస్యం చెప్పారు. హెచ్‌డీ కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్‌తో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని చెప్పారు. మే 10న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం జరుగుతుందనే సంగతి తెలిసిందే.

జేడీఎస్ మాజీ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ శుక్రవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఎన్నికల పలితాలు వెలువడటానికి ముందే తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సరైన సమయం వచ్చినపుడు ప్రజలకు ఈ విషయాన్ని వెల్లడిస్తామన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని జేడీఎస్ అగ్ర నేతలు ప్రకటించారు. జేడీఎస్ (JDS) కర్ణాటక విభాగం అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం మాట్లాడుతూ, తాను జేడీఎస్ అధికార ప్రతినిధినని తన్వీర్ అహ్మద్ చెప్పుకుంటున్నారని, కానీ ఆయన తమ పార్టీ అధికార ప్రతినిధి కాదన్నారు. శనివారం ఫలితాలు తెలిసే వరకు వేచి చూస్తామని తెలిపారు. పొత్తుల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

జైరామ్ రమేశ్ (Jairam Ramesh) శుక్రవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, జేడీఎస్ ముక్కలైపోతుందని తాను కచ్చితంగా చెప్పగలనని తెలిపారు. ఈసారి జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. కర్ణాటకలో బీజేపీ (BJP) ఓటమితో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుందని చెప్పారు.

కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనుబట్టి కాంగ్రెస్ కాస్త ముందంజలో ఉంటుందని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 113 మంది ఎమ్మెల్యేల బలం రాకపోవచ్చునని తెలిసింది. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనుబట్టి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తెలుస్తోంది. ఈ రెండు పరిస్థితుల్లోనూ కింగ్‌మేకర్‌గా వ్యవహరించే అవకాశం జేడీఎస్‌కు వస్తుంది. అన్నీ కలిసి వస్తే కుమార స్వామి మరోసారి ముఖ్యమంత్రి కాగలుగుతారు.

ఇవి కూడా చదవండి :

Rajasthan: గెహ్లాట్‌కు ఆర్‍ఎస్ఎస్ ఫోబియా...బీజేపీ చీఫ్ ఫైర్..!

Karnataka election : ‘కింగ్‌మేకర్’ జేడీఎస్ సిద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు సైగలు..

Updated Date - 2023-05-12T20:54:11+05:30 IST