Home » Karnataka
ప్రమాదాలు రెప్పపాటులో జరుగుతుంటాయి. కర్ణాటకలో ఇలా ఓ ప్రమాదం జరిగింది. కారు రివర్స్ చేస్తోండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీ కొంది.
ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో నీరు రోజురోజుకు రంగుమారుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్లో అల్పపీడనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈ కలుషిత నీటి వల్ల రబీ పంటలో కూడా దెబ్బతింటాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందనే సీఎం సిద్ద రామయ్య(CM Siddaramaiah) ఆరోపణలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్జోషి(Union Minister Pralhad Joshi) తిప్పికొట్టారు. హుబ్బళ్ళిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నింది సిద్దరామయ్య అన్నారు.
ముడా సైట్లు వాపసు ఇవ్వమని అప్పుడే చెప్పలేదా... నా మాట విని ఉంటే ఎంతో బాగుండేదని ఈ కేసుల వివాదం ఏంటంటూ సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)తో కేంద్రమంత్రి సోమణ్ణ(Union Minister Somanna) ప్రస్తావించారు. సోమవారం రమణశ్రీ హోటల్లో జరిగిన అఖిల భారత శరణసాహిత్య పరిషత్ సభకు సీఎం వస్తుండగా అప్పుడే కేంద్రమంత్రి సోమణ్ణ బయటకు వచ్చారు.
వరకట్నం కేసులో 93 ఏళ్ల వృద్ధురాలు జైలులో శిక్ష అనుభవిస్తుండడాన్ని గమనించిన ఉప లోకాయుక్త స్పందించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కలబురిగి(Kalaburigi) జిల్లా పర్యటనలో ఉన్న ఉపలోకాయుక్త శివప్ప శనివారం స్థానిక సెంట్రల్జైలును సందర్శించారు. ఖైదీలతో అక్కడి వసతులు, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు.
మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన మంగళూరులో చోటు చేసుకుంది. సరదాగా గడిపేందుకు వచ్చిన ముగ్గురు యువతులు.. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ..
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో ఏ2గా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) బెయిల్ ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. హత్యకేసులో రిమాండు ఖైదీగా బళ్ళారి జైలులో ఉంటూ దర్శన్ వెన్నునొప్పి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ పొందారు.
గాడిద పాల వ్యాపారం పేరుతో రైతులను డ్యాంకీ ప్యాలెస్ సంస్థ నట్టేట ముంచింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్ కమల’ కుట్ర సాగుతోందని ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్ల చొప్పున చెల్లించాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారని సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మార్కెట్లో లభించే వస్తువులుగా పోల్చి సీఎం అవమానించారన్నారు.
కొవిడ్ అక్రమాలపై రిటైర్డు న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.