BJP: ‘ఆపరేషన్ కమల’ వ్యాఖ్యలపై.. భగ్గుమన్న బీజేపీ
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:16 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్ కమల’ కుట్ర సాగుతోందని ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్ల చొప్పున చెల్లించాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారని సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మార్కెట్లో లభించే వస్తువులుగా పోల్చి సీఎం అవమానించారన్నారు.
- ఎమ్మెల్యేలను వస్తువులుగా పోల్చడం అవమానం: విజయేంద్ర
- ఆరోపణలు నిరూపించాలి: సీటీ రవి
బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్ కమల’ కుట్ర సాగుతోందని ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్ల చొప్పున చెల్లించాలని రాష్ట్ర బీజేపీ(BJP) నేతలు ప్రయత్నించారని సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర(President Vijayendra) బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మార్కెట్లో లభించే వస్తువులుగా పోల్చి సీఎం అవమానించారన్నారు. మీ ఎమ్మెల్యేలపై విశ్వాసం కోల్పోయి ఊహకు అందని ఆరోపణలు చేశారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Rains: బలహీనపడిన అల్పపీడనం.. అయినా తేలికపాటి వర్షం
ఎమ్మెల్యేలపై విశ్వాసం లేనందునే రూ.50కోట్లకు అమ్ముడు పోతారని వ్యాఖ్యానించారన్నారు. ముడా కేసు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం కొత్త వివాదం తెరపైకి తెచ్చారన్నారు. కనీస రాజకీయ జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఇలాంటి అబద్ధాలు మాట్లాడతారా..? అంటూ మండిపడ్డారు. 50 కోట్ల రూపాయల ఆశ చూపామనడానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుమోటోగా విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి హోదాలో 50 కోట్ల రూపాయల ప్రస్తావన తెచ్చారని డిమాండ్ చేశారు.
అధిష్ఠానాన్ని బెదిరించేందుకే...
ఉప ఎన్నికల పోలింగ్ రోజునే సీఎం సిద్దరామయ్య కొత్త పాట పాడారని బీజేపీ ప్రధాన కార్యదర్శి సునిల్‌కుమార్ మండిపడ్డారు. మరికొన్ని రోజుల్లో శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని ఈలోగానే కొత్త ముఖ్యమంత్రి వస్తారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు కుట్ర అనేది ఒక పెద్ద జోక్ అన్నారు. సీఎంగా సిద్దరామయ్య వంద అబద్ధాలు చెప్పారని, ఇది 101వదన్నారు. ఎమ్మెల్యేలకు గ్రాంట్లు విడుదల చేయలేదని, ప్రభుత్వంపైనే తిరగబడుతుంటే వారిని అవమానించేలా కొత్త అంశం తెరపైకి తెచ్చారన్నారు.
ఎవరు ప్రయత్నించారో నిరూపించాలి : సీటీ రవి
బీజేపీ నాయకులపై సీఎం సిద్దరామయ్య ఆరోపణలు అబద్ధాలకు పరాకాష్ట ఎమ్మెల్సీ సీటీ రవి పేర్కొన్నారు. ఎవరు, ఎప్పుడు, ఏఏ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి రూ.50కోట్ల ప్రతిపాదన పెట్టారో సాక్షాలతో నిరూపించాలన్నారు. రూ.50కోట్లకు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నారంటే అంత దిగజారే స్థాయిలో మీ ఎమ్మెల్యేలు ఉన్నారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో 137మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మిమ్మల్ని ఎవరూ కదిలించలేదని ఏదైనా జరిగితే మా పార్టీలో అంతర్గంతంగానే కొనసాగవచ్చునని అది పరిశీలించుకోవాలన్నారు. అబద్ధాలు చెప్పకుంటే తిన్నది జీర్ణం కాదా..? అన్నారు.
సీఎంను ముట్టుకుంటే కేసులు : కేంద్రమంత్రి ఎద్దేవా
సీఎంను ముట్టుకుంటే పోలీసులు అరెస్టు చేస్తారని కేంద్రమంత్రి సోమణ్ణ ఎద్దేవా చేశారు. తనను ముట్టుకుంటే కర్ణాటక ప్రజలు వదలరంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు. మిమ్మల్ని ఎవరూ ముట్టుకోరని, చుట్టూ సెక్యూరిటీ ఉంటుందన్నారు. రెండుసార్లు సీఎంగా కొనసాగిన సిద్దరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
విజయేంద్రకు సమాధానం చెప్పాలా: సీఎం
ఆపరేషన్ కమల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విజయేంద్ర ప్రశ్నలపై సీఎంను కోరగా నిన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చిన విజయేంద్రకు నేను సమాధానం చెప్పాలా..? అంటూ దాటవేశారు.
ఏ క్షణంలోనైనా సీఎంకు నోటీసులు
ముడా ఇళ్లస్థలాల అవినీతి కేసును వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ త్వరలోనే సీఎం సిద్దరామయ్యకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా గురువారం ఆయన ఆప్తుడు, ముడా మాజీ చైర్మన్ మరిగౌడతోపాటు గతంలో మైసూరు తహసీల్దారుగా వ్యవహరించిన నటేశ్‌ను ఈడీ అధికారులు విచారణ జరిపారు. సీఎం సిద్దరామయ్య భార్య పార్వతిలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లోకాయుక్త విచారణకు సీఎం హాజరయ్యారు. ఈడీ నోటీసులు జారీ చేస్తే పరిణామం తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే
ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు
ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ
Read Latest Telangana News and National News