Share News

Minister: కొవిడ్‌ అక్రమాలపై సిట్‌తో దర్యాప్తు

ABN , Publish Date - Nov 15 , 2024 | 11:50 AM

కొవిడ్‌ అక్రమాలపై రిటైర్డు న్యాయమూర్తి జాన్‌ మైఖేల్‌ కున్హా నేతృత్వంలోని కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేసేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.

Minister: కొవిడ్‌ అక్రమాలపై సిట్‌తో దర్యాప్తు

- మైఖేల్‌ కున్హా కమిటీ సిపారసుల అమలుకు ప్రభుత్వం నిర్ణయం

- సీబీఐ తిరస్కరించిన గనుల అక్రమాలపైనా విచారణ

- కేబినెట్‌లో కీలక తీర్మానం

బెంగళూరు: కొవిడ్‌ అక్రమాలపై రిటైర్డు న్యాయమూర్తి జాన్‌ మైఖేల్‌ కున్హా నేతృత్వంలోని కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేసేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్‌ తీర్మానాలను న్యాయ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌(Minister HK Patil) మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ అక్రమాలపై న్యాయమూర్తి జాన్‌ మైఖేల్‌ కున్హా నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేసిందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Deputy CM: డిప్యూటీ సీఎం అలా అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..


కమిషన్‌ రెండు మధ్యంతర నివేదికలలో భారీ అవినీతి చోటు చేసుకుందని ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారని, అమానుషమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని పొందుపరిచిందన్నారు. అందుకు అనుగుణంగా సిట్‌ను ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. పీపీఈ కిట్‌ కొనుగోలుతోపాటు ప్రతి విషయంలోనూ అవినీతి చోటు చేసుకుందన్నారు. అన్ని అంశాలపైనా దర్యాప్తు జరిపి ఎఫ్‌ఐఆర్‌ చార్జ్‌షీట్‌లు నమోదు చేసి నిందితులను గుర్తించి సమగ్రంగా శిక్ష విధించి రాష్ట్ర ప్రజలకు న్యాయం కల్పించాలని తీర్మానించామన్నారు.


ఇక సీబీఐ స్వీకరించిన గనుల అక్రమాల వివాదంలో 6 కేసులలో దర్యాప్తు కొనసాగించలేమని తెలిపిందన్నారు. వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నామని దర్యాప్తు జరిపేందుకు మంత్రివర్గం తీర్మానించిందన్నారు. గోవాలోని మర్మగోవా, పానాజి, తమిళనాడులోని ఎన్నూరు చెన్నై, కర్ణాటకలోని నవమంగళూరు, కారవార ఓడరేవులు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, కాకినాడ, విశాఖపట్నం ఓడరేవులలో అక్రమంగా ముడిఖనిజం ఎగుమతికి సంబంధించిన కేసులను సీబీఐ వాపసు పంపిదన్నారు. వాటిని సిట్‌ ద్వారా విచారణ జరిపించదలిచామన్నారు.


రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగేలా సి గ్రూప్‌కు చెందిన పది గనుల కంట్రాక్టు సంస్థల అక్రమాలను విచారించేందుకు సిట్‌ ఏర్పాటు చేశామన్నారు. వీటిలో మైసూరు మాంగనీస్‌ కంపెనీ, దశరథరామిరెడ్డి గనుల కంపెనీ, అల్లం వీరభద్రప్ప కంపెనీ, కర్ణాటక లింఫో కంపెనీ, అంజనా మినరల్స్‌, రజియాఖానుం కంపెనీ, మిలన మినరల్స్‌, ఎం శ్రీనివాసులు కంపెనీ, చన్నకేశవరెడ్డి, రాజశేఖర్‌ కంపెనీలకు మంజూరు చేసిన భూమికంటే ఎక్కువగా తవ్వకాలు జరిపినట్టు ప్రాథమికంగా గుర్తించిన మేరకు లోకాయుక్త ప్రత్యేక బృందం ద్వారా విచారణలు జరిపేలా తీర్మానించామన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే

ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు

ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..

ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2024 | 11:50 AM