Home » Kavitha Arrest
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) విషయంలో రౌస్ అవెన్యూ(Rouse Avenue Court) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ(ED Custody) ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని.. ఒకవేళ విచారించినా గంటో, రెండు గంటలో ప్రశ్నిస్తారని కవితతోపాటు
Kavitha Arrest: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది..
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగో విడతలో తెలంగాణలో 17 లోక్‌సభ(Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తై వంద రోజులు మాత్రమే గడిచాయి. మూడు నెలల కాలంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. పులి పిల్లైంది..పిల్లి పులైంది అనే సామెతను గుర్తుచేస్తోంది తెలంగాణ రాజకీయం.
Meka Sravan ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులకు పొడిగించిన సంగతి తెలిసిందే. అటు సోదాలు.. ఇటు రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో కవిత రిమాండ్ రిపోర్టును ఈడీ విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. తాజా ఈడీ అఫిడవిట్‌తో కొత్త పేరు తెరపైకి వచ్చింది..
లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టుపై జర్మనీ చేసిన కామెంట్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని పేర్కొంది.
Kavitha ED Custody: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాసింత రిలీఫ్ దక్కింది. ఓ వైపు వరుస ఈడీ సోదాలు.. మరోవైపు కస్టడీలో విచారణతో సతమతం అవుతున్న కవిత..
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటి ముగిసింది. దీంతో కాసేపటి క్రితమే కవితను ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కుంటున్నారు. అయితే విచారణ సమయంలో కవిత తీవ్రమైన రక్తపోటును ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితను ఆమె కుమారుడు ఆర్యతో పాటు కుటుంబ సభ్యులు, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ రోజుకు గంట సేపు కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి సమయంలో ఆమెను కలుస్తున్నారు. తాజాగా కవిత కుమారుడు ఆర్య ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను కలిశారు.