Share News

Telangana: ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దనే విపక్ష నేతలకు ఈడీ నోటీసులు: క్రిశాంక్

ABN , Publish Date - Mar 28 , 2024 | 05:59 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రభుత్వంపై బీఆర్ఎస్(BRS) అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్(Krishank) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఏ పార్టీ(Political Party) కూడా ఉండకూడదని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన..

Telangana: ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దనే విపక్ష నేతలకు ఈడీ నోటీసులు: క్రిశాంక్
Krishan Slams PM Modi

హైదరాబాద్, మార్చి 28: కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రభుత్వంపై బీఆర్ఎస్(BRS) అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్(Krishank) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఏ పార్టీ(Political Party) కూడా ఉండకూడదని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదు అన్న అంశం లోక్‌సభ ఎన్నికల ఎజెండాగా ఉండరాదన్నదే బీజేపీ ఆలోచన అని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్సీ కవితను, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని క్రిశాంక్ ఆరోపించారు. కేరళ సీఎం విజయన్‌ కుమార్తెపై ఈడీ కేసు నమోదు చేసిందని.. ఆర్జేడీ, శివసేన, డీఎంకే, టీఎంసీ, సమాజ్ వాదీ నేతలకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. ఇదంతా విపక్షాలపై మోదీ చేస్తున్న కుట్ర అని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా.. మోదీ విచారణలో పాల్గొనాలా..? అని ప్రశ్నించారు.

అసలు కుట్ర ఇదే..

ఎన్నికల సమీపించడంతో.. అన్ని రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ, సీబీఐ చే దాడులు చేయిస్తున్నారని.. పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చ లేకుండా చేస్తున్నారని క్రిశాంక్ ఆరోపించారు. విపక్షాలు నోరెత్తకుండా చేస్తే.. ఎన్నికల్లో గెలవొచ్చనే దురాలోచనతోనే మోదీ ఇదంతా చేయిస్తున్నారని క్రిశాంక్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలను నడుపుతున్నది ఈసీ కాదని, ఈడీ నడుపుతోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలు అందరూ ప్రచారం చేయకుండా ఈడీ కార్యాలయాల చుట్టూ తిరగాలట అని అన్నారు.

Also Read: సందడే సందడి.. వెంకటేష్‌తో బర్రెలక్క ఏడడుగులు..

బీజేపీలో చేరితో నో ప్రాబ్లమ్..

ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ సంస్థలతో వేధింపులకు గురి చేస్తున్న మోదీ ప్రభుత్వం.. బీజేపీలో చేరి లొంగితే మాత్రం ఎలాంటి అరెస్టులు ఉండవన్నారు. అదే లొంగకుండా పోరాటం చేస్తున్న వారిపై వేధింపులు, దాడులు, కేసులు పెడుతున్నారని క్రిశాంక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలు ఎజెండాగా కాకుండా దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

అందరినీ జైల్లో పెట్టి..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టి ఏకపక్షంగా ఎన్నికల్లో గెలవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని క్రిశాంక్ విమర్శించారు. ఈడీ ఆధ్వర్యంలో ఈ వెబ్ సిరీస్ నడుపుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తామని, 400 సీట్లు వచ్చే ధైర్యం ఉంటే మోదీ ఇలా ఎందుకు చేస్తున్నారు? అని క్రిశాంక్ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే మోదీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ లేదు అంటున్న కిషన్ రెడ్డి.. తమ పార్టీ నేతలను ఎందుకు తీసుకుని టికెట్లు ఇస్తున్నారని క్రిశాంక్ ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 05:59 PM