Share News

Kavitha: ఉదయం నుంచి హైటెన్షన్.. ఫైనల్‌గా కవితకు బిగ్ షాక్!

ABN , First Publish Date - Mar 26 , 2024 | 11:24 AM

Kavitha Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు బిగ్ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత.. కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఫైనల్‌గా 14 రోజులపాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు..

Kavitha: ఉదయం నుంచి హైటెన్షన్.. ఫైనల్‌గా కవితకు బిగ్ షాక్!

Live News & Update

  • 2024-03-26T13:15:11+05:30

    జైలుకు తరలిస్తున్న ఈడీ

    • కవితకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధింపు

    • కస్టడీ పెంచాలని న్యాయస్థానాన్ని కోరిన ఈడీ

    • ఏప్రిల్-09 వరకు కవిత జ్యూడిషియల్ రిమాండ్

    • కవితను తీహార్‌ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం

    • ఏప్రిల్-09న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలన్న కోర్టు

    • ఏప్రిల్-01న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు

    • కవితను తీహార్ జైలుకు తరలిస్తున్న ఈడీ అధికారులు

    Kavitha-Jail.jpg

  • 2024-03-26T12:55:39+05:30

    కవితకు రిమాండ్

    • కవితకు 14 రోజుల జ్యుడిషల్ రిమాండ్ విధించిన కోర్టు

    • ఏప్రిల్-09 వరకు కస్టడీలో ఉండనున్న కవిత

    • ఇవాళ ఉదయం నుంచి జైలా.. బెయిలా అని తీవ్ర ఉత్కంఠ

    • ఫైనల్‌గా ఈడీ కస్టడీకి ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు

    • కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి

    • మొదట వారం రోజులు.. ఆ తర్వాత మూడ్రోజులు.. ఇప్పుడు ఏకంగా 14 రోజులు కస్టడీలో కవిత

    • తీహార్ జైలుకు తరలించి అక్కడే విచారిస్తారని చెబుతున్న ఢిల్లీ వర్గాలు

    • కవిత మధ్యంతర బెయిల్‌పై ఏప్రిల్-01న విచారణ

    Kvaitha-Talks.jpg

  • 2024-03-26T12:50:15+05:30

    విచారణ షురూ!

    • లిక్కర్ కేసు దర్యాప్తులో వేగం పెంచిన ఈడీ

    • కవిత బంధువు మేకా శరణ్‌ను విచారిస్తున్న ఈడీ

    • ఇవాళ ఉదయం నుంచి ఈడీ కార్యాలయంలోనే శరణ్

    • ఇటీవల హైదరాబాద్‌లో శరణ్ ఇంటిపై ఈడీ సోదాలు

    • శరణ్ ఎవరో తనకు తెలియదని కవిత చెప్పినట్లు సమాచారం

    • పదే పదే అడిగినా కవిత నుంచి రాని సమాచారం

    • సోదాల్లో అసలు విషయం తెలిసిందని అంటున్న ఈడీ

    • శరణ్‌ బ్యాంక్ లావాదేవీలు, వ్యాపారాలపై ఈడీ ఆరా..?

    Enforcement-Directorate.jpg

  • 2024-03-26T12:30:04+05:30

    బెయిల్ ఇవ్వండి..!

    • కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

    • పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం కోరిన ఈడీ

    • కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ కోరిన కవిత

    • తీర్పు రిజర్వ్‌ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు

    kavitha-twitter.jpg

  • 2024-03-26T12:15:56+05:30

    ముగిసిన వాదనలు

    • కవిత కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో ముగిసిన వాదనలు

    • తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి

    • మరికాసేపట్లో కవిత కేసులో తీర్పు

    • తీర్పు ఎలా ఉంటుందా..? అని బీఆర్ఎస్‌లో పెరిగిన టెన్షన్

    Kavitha-ED-Enquiry-Latest-1.jpg

  • 2024-03-26T12:00:59+05:30

    జైలుకెళ్తా.. బయటికొస్తా..!

    • కోర్టుకు వచ్చే ముందు కవిత సంచలన వ్యాఖ్యలు

    • కడిగిన ముత్యంలా బయటికి వస్తాను

    • ఇది మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు

    • నన్ను తాత్కాలింగా జైలులో పెట్టొచ్చు..

    • క్లీన్‌గా బయటికి వస్తాను

    • నేను తప్పు చేయలేదు.. అప్రూవర్‌గా మారను

    • ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలోకి..

    • 2వ నిందితుడికి బీజేపీ టిక్కెట్..

    • మూడో నిందితుడికి 50 కోట్లు ఇచ్చారు : కవిత

    Kvaitha-Talks.jpg

  • 2024-03-26T11:55:21+05:30

    కస్టడీకి ఇవ్వండి!

    • రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచిన ఈడీ

    • కవితను జ్యుడీషియల్ కస్టడీ కోరిన ఈడీ

    • మరికొన్ని రోజులు కస్టడీ ఇవ్వాల్సిందేనని ఈడీ పట్టు

    • కాసేపట్లో కస్టడీపై నిర్ణయం తీసుకోనున్న కోర్టు

    • కచ్చితంగా కస్టడీ ఇచ్చే అవకాశం ఉందంటున్న ఈడీ వర్గాలు!

    Kavitha-Rouse-Avenue.jpg

  • 2024-03-26T11:50:13+05:30

    మళ్లీ కస్టడీ ఎందుకంటే..?

    • కవితకు విచారణకు సహకరించట్లేదని పదే పదే చెప్పిన ఈడీ

    • ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన ఈడీ అధికారులు

    • మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్న ఈడీ

    • కేజ్రీవాల్‌, కవితను కలిపి విచారించాలనే యోచనలో ఈడీ

    • అందుకే మరో వారంపాటు కస్టడీకి ఇవ్వాలని కోరనున్న ఈడీ?

    Kavitha-and-Kejriwal.jpg

  • 2024-03-26T11:45:45+05:30

    కోర్టుకు కవిత!

    • రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చిన కవిత

    • కొద్దిసేపటి క్రితమే కోర్టుకు తీసుకొచ్చిన ఈడీ అధికారులు

    • 11 గంటలకే కోర్టు ముందు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యం

    • మరికొన్నిరోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరే ఛాన్స్!

    Kavitha-ED-Enquiry-Latest.jpg

  • 2024-03-26T11:00:33+05:30

    లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత Kavitha ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ (మంగళవారం) ఉదయం 11 గంటలకే ఈడీ (ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపర్చాల్సి ఉంది. కానీ.. 11 గంటలు దాటినా ఇంతవరకూ కవితను కోర్టుకు తీసుకురాలేదు. కవితను కోర్టుకు తీసుకొస్తే.. ఏం జరగుబోతోంది..? మళ్లీ కస్టడీకి ఇస్తారా.. లేకుంటే బెయిల్ దక్కుతుందా.. ఈ రెండు కాకుండా తీహార్ జైలుకెళ్లడం ఖాయమా..? అనేదానిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కవిత కస్టడీని పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఒకేసారి కలిపి విచారించే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు సమాచారం.

    మరోవైపు.. రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని ఈ నెల 23న రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఏం జరుగుతుందో ఏమోనని కవితలో.. ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. అంతా మంచే జరగాలని బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి.