Home » Kerala
కేరళ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై నిఘా వేశారు. ముఖ్యంగా కేరళ నుంచి కోళ్ళ దానా, కోళ్ళ ఉత్పత్తులు, కోడిమాంసం, కోడిగుడ్లు వంటివి సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళా జిల్లాలోని కుట్టనాడులో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులు వచ్చిన కిలోమీటరు దూరంలోని కోళ్ళఫారాల్లో కోళ్ళతో పాటు కోళ్ళ ఉత్పత్తులను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటాం. కొందరు....
'ఇండియా' కూటమిలో మిత్రులు, కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. మీ నాన్నమ్మ కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటు విమర్శలకు దిగారు. సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో నిషేధానికి గురైన ఒక సంస్థకు చెందిన రాజకీయ విభాగంతో రాహుల్ 'రహస్య ఒప్పందం' కుదుర్చుకున్నారని ఆరోపించారు.
కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ కోసం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ రవి రంగంలోకి దిగారు. అతడిని మరణ శిక్ష నుంచి రక్షించేందుకు సాక్షాత్తు సీఎం నడుం బిగించారు. ఆ క్రమంలో అతడిని రక్షించేందుకు నేను సైతం అంటూ ప్రపంచంలోని మలయాళీలంతా కదిలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.
రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనడానికి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.. ఒకచోట ప్రశంసలు కురిపించు కున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.
కేరళ ( Kerala ) లోని వాయనాడ్ జిల్లాలో హాస్టల్ వాష్‌రూమ్‌లో కాలేజీ విద్యార్థి మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 ఏళ్ల సిద్ధార్థన్ వెటర్నరీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్‌సభ స్థానాలు ఉన్నాయన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ది కేరళ ( Kerala ) స్టోరీ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రసారం చేయాలనే దూరదర్శన్ నిర్ణయాన్ని ఆయన ఖండించారు.
రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది బీజేపీ. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ అమేథీలో ఓడిపోయారు. వయనాడ్‌లో మాత్రం గెలిచారు. ఈ ఎన్నికల్లో కేవలం వయనాడ్ నుంచి మాత్రమే రాహుల్ పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షులు కె సురేంద్రన్ను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.