Home » Kesineni Chinni
ఏవండోయ్ నాని గారు.. ఏమండోయ్ చిన్ని గారు అనే సినిమా పాట గుర్తుంది కదా.. ఇప్పుడది విజయవాడ వేదికగా రియల్‌గా పాడేసుకుంటున్నారు జనాలు. ఎందుకంటే.. నాని, చిన్ని బ్రదర్స్ ఇద్దరూ వర్సెస్ అయ్యారు. విజయవాడ నుంచి ఒకరు టీడీపీ తరఫున.. మరొకరు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో నాని, చిన్నీ పేర్లు ఏపీలో మార్మోగుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. విజయవాడ అంటే.. విద్యలకే వాడే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి సైతం కేరాఫ్ అడ్రాస్.
వైసీపీ ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎలాంటి మేలు జరగలేదని, క్రిస్మస్ కానుకలు కూడా ఇవ్వలేదని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని)(Kesineni Chinni) తెలిపారు. సోమవారం నాడు తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని మనూ గార్డెన్లో నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని రాజకీయపరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని, సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు. రాజకీయాల నుంచి జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కేశినేని చిన్ని హెచ్చరించారు.
జగన్ ప్రభుత్వం (Jagan Govt) గత నాలుగున్నరేళ్లుగా వ్యాపారస్తులు, ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) అన్నారు. గురువారం నాడు గంపలగూడెం తోటమూల సెంటర్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలతో కలిసి చిన్ని ప్రారంభించారు. గంపలగూడెంలో భారీ ర్యాలీతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
వైసీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి ఏం జరగడం లేదని.. అక్రమాలు, అన్యాయాలు పెరిగిపోతున్నాయని కేశినేని చిన్ని(శివనాథ్)(Kesineni Chinni) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని కేసినేని నాని నిజం ఒప్పుకున్నాడన్నారు.
టీడీపీ సీనియర్ జలీల్‌ఖాన్‌తో కేశినేని చిన్ని భేటీ అయ్యారు. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేశారు. దిద్దుబాటు చర్యలలో భాగంగా కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం రంగంలోకి దించడం జరిగింది.
క్రీస్తురాజుపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపునిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు.
Andhrapradesh: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ సీనియర్ నేతలు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో ఏపీ కళకళలాడుతోందన్నారు. ఎక్కడెక్కడి నుంచో యువత ఏపీకి తరలి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఉద్యోగం లేదన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. నానికి మతి భ్రమించిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని నానికి విశ్వాసం లేదని చిన్ని మండిపడ్డారు. వైసీపీలో నాని చేరడంతో.. సైకోలు అందరూ ఒకే చోట చేరారని విమర్శలు గుప్పించారు.