Kesineni Chinni: వైసీపీ ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎలాంటి మేలు జరగలేదు
ABN , Publish Date - Mar 11 , 2024 | 10:28 PM
వైసీపీ ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎలాంటి మేలు జరగలేదని, క్రిస్మస్ కానుకలు కూడా ఇవ్వలేదని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని)(Kesineni Chinni) తెలిపారు. సోమవారం నాడు తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని మనూ గార్డెన్‌లో నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎలాంటి మేలు జరగలేదని, క్రిస్మస్ కానుకలు కూడా ఇవ్వలేదని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని)(Kesineni Chinni) తెలిపారు. సోమవారం నాడు తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని మనూ గార్డెన్‌లో నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశినేని శివనాథ్(చిన్ని) తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు హయాంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారని.. ఈ ప్రభుత్వంలో అరకొరగానే పంపిణీ చేశారని అన్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మైనార్టీ కార్పొరేషన్ నుంచి క్రైస్తవ కార్పొరేషన్‌ను వేరు చేసి క్రైస్తవులకు గుర్తింపు తెచ్చే విధంగా ప్రత్యేక క్రైస్తవ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారని అన్నారు. అలాగే పాస్టర్లకు గృహ నిర్మాణం ఏర్పాటు చేస్తారన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే... పిల్లలకు బంగారు భవిష్యత్తు రావాలంటే చంద్రబాబు సీఎం కావాలని చెప్పారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించిది గత టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. వెనుకబడిన తిరువూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కొలికపూడి వల్లే సాధ్యమవుతుందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని.. మనకు ప్రజాబలంతో పాటు దైవ బలం కూడా ఉండాలని చెప్పారు. సొంత తల్లి, చెల్లిని సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేసే జగన్ లాంటి వ్యక్తిని దేవుడు ఎలా కరుణిస్తాడని చిన్ని ప్రశ్నించారు.
మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడిగే వ్యక్తి జగన్: కొలికపూడి శ్రీనివాసరావు
మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapudi Srinivasa Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుంటూరులో రూ.16 కోట్లతో చంద్రబాబు క్రైస్తవ భవనం కట్టారని జగన్ పరిపాలనలో క్రైస్తవులకు ఒక భవనమైన నిర్మించారా అని ప్రశ్నించారు. జగన్ క్రైస్తవుడు కాదు వేషధారి అని విమర్శించారు. జగన్ క్రైస్తవ మతాన్ని వాడుకొని క్రైస్తవులకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు క్రైస్తవుల బిడ్డలను అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా విదేశాలకు పంపిస్తే.. జగన్ మిరప కోతలకు పంపుతున్నారని మండిపడ్డారు. కేశినేని చిన్నిఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలను టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని చంద్రబాబుకి గిఫ్ట్‌గా ఇవ్వాలని కొలికపూడి శ్రీనివాసరావు కోరారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి