AP News: టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని హాట్ కామెంట్స్..
ABN , Publish Date - Mar 10 , 2024 | 12:30 PM
టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని రాజకీయపరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని, సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు. రాజకీయాల నుంచి జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కేశినేని చిన్ని హెచ్చరించారు.
విజయవాడ: టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని రాజకీయపరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని, సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు. రాజకీయాల నుంచి జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కేశినేని చిన్ని హెచ్చరించారు. ‘‘చంద్రబాబు మంచోడు.. లోకేష్ అంత మంచోడు కాదు’’ అని ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్‌లో పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు ఉన్నాయని అన్నారు.
ఇక విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేస్తామని కేశినేని చిన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ సీటుని 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయఢంకా మోగించడం ఖాయమని అన్నారు. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని అన్నారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.