Home » Khammam News
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, భద్రాచలంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార తనిఖీ శాఖ అధికారులు ఆది, సోమవారాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆదివారం ఖమ్మంలోని 3 ప్రముఖ రెస్టారెంట్లలో రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ జ్యోతిర్మయి, నల్లగొండ, వనపర్తి ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వాతి, నీలిమ టాస్క్‌ఫోర్స్ బృందంగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతాంగం కోసం పనిచేశానని చెప్పారు.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీ్‌సగఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో భాగస్వాములైన మొత్తం 28 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నోటీసులివ్వగా.. వారిలో 25 మంది దాకా అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానలిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం చూసి బీఆర్ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఎస్.ఆర్.కన్వెన్షన్‌లో నియోజక వర్గ సమావేశం నిర్వహించారు.
రాజకీయాల్లో విజయం, అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొత్తూ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పుకు కట్టుబడి సుపరిపాలన అందించాలని సూచించారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ తీన్నార్ మల్లన్న కావాలో.. బీఆర్ఎస్ గోల్డ్ మెడల్ ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలో ఆలోచించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు.
రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్‌లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈ హబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో.. కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు.
పచ్చిమిర్చి ధరలు మండు తున్నాయి. వారం క్రితం వరకు కిలో రూ.50-రూ.60 పలికిన ధర ఇటీవల భారీగా పెరిగింది.
కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.