Home » Khammam
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం మహబూబ్నగర్లో జరుగుతుందని వికా్సరాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు తక్కువగానే ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరో వెంటనే తేలిపోతుందన్నారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
రాష్ట్రంలో ఎండలు తీవ్రత కొనసాగుతోంది. మూడ్రోజులుగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. శనివారం ఒక్కరోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)లో 45.7, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 45.5,
రఘునాథపాలెం మండలం హర్యాతండాలో నిన్న జరిగిన కారు ప్రమాద ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఖమ్మం జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు రహదారి పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని భార్య, ఇద్దరు చిన్నారులు మరణించగా, కారు నడిపిన భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, భద్రాచలంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార తనిఖీ శాఖ అధికారులు ఆది, సోమవారాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆదివారం ఖమ్మంలోని 3 ప్రముఖ రెస్టారెంట్లలో రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ జ్యోతిర్మయి, నల్లగొండ, వనపర్తి ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వాతి, నీలిమ టాస్క్ఫోర్స్ బృందంగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన పోలింగ్లో మూడు జిల్లాల పరిధిలోని ఓటర్లలో 73 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు సమాచారం.
Telangana Graduate MLC By Elections: తెలంగాణలో(Telangana) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్(MLC Election Polling) ముగిసింది. ఖమ్మం(Khammam)-నల్లగొండ(Nalgonda)-వరంగల్(Warangal) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
తెలంగాణలో వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటుచేశారు.