Home » Khammam
ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి, పోలేపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలనుంచి మంత్రి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
Telangana: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు.
పచ్చిమిర్చి ధరలు మండు తున్నాయి. వారం క్రితం వరకు కిలో రూ.50-రూ.60 పలికిన ధర ఇటీవల భారీగా పెరిగింది.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. గుండెపోటుతో ఓ ఎన్నికల ఉద్యోగి, ఐదుగురు ఓటర్లు మృతి చెందారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని నెహ్రూనగర్ పోలింగ్ బూత్‌లో ఏపీవోగా విఽధులు నిర్వరిస్తున్న శ్రీకృష్ణ (55) గుండెపోటుతో కుప్పకూలాడు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Telangana: ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల పహారా నడుమ పోలింగ్ కొనసాగనుంది.
ఉన్నత విద్య కోసం రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఇద్దరు యువకులు డిగ్రీ పట్టా అందుకున్న వారం రోజులకే అక్కడి ఓ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని అరిజోనా ఫాసిల్ క్రీక్ జలపాతం వద్ద ఏప్రిల్ 8న జరిగిన ఘటనలో ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి(23), హైదరాబాద్‌కు చెందిన రేపాల రోహిత్ మణికంఠ(25) ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Telangana: ప్రచారంలో ప్రతీ గడపకు వెళ్లి ప్రజలను కలవడం చాలా సంతోషంగా ఉందని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్తి నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... క్యాడర్ అందరు కలిసి కట్టుగా పనిచేశారని.. గ్రామస్థాయిలో బాగా ప్రచారం జరిగిందని తెలిపారు. ప్రచారంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాల గురించి తనకే చెప్పారన్నారు.
Telangana: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘మీరంతా ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. అది ఒక వ్యక్తి కోసం కాదు కాంగ్రెస్ విధానాలకు వేయండి. ఎంతమంది తిరుగుతుంటారు’’..