Home » Kolikapudi Srinivasa Rao
తన వ్యవహార శైలిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఇకపై పార్టీలోని పెద్దలతో గతంలో వలే వ్యవహరించనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం తిరువూరులోని శ్రీరస్తూ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు.
వైఖ రి మార్చుకోకపోతే నష్టపోతారని, పార్టీ నాయకులతో తరచూ వివాదాలకు దిగడం శ్రేయస్కరం కాదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు పార్టీ పెద్దలు హెచ్చరించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని, సీనియర్ నేతలు వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణ రాజు తదితరులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పిలిపించి మాట్లాడారు. తన పనితీరు కొందరికి ఇబ్బందులు కలిగిస్తాయని తాను ఊహించలేదన్నారు. తన కారణంగా తలెత్తిన..
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మరోసారి చర్చనీయాంశమయ్యారు. తనపై కొందరు చేసిన ఆరోపణలపై టీడీపీ అధిష్ఠానం సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఇవాళ (సోమవారం) ఆయన దీక్షకు దిగారు.
టీడీపీ కాల్ సెంటర్ నుంచి కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై నియోజకవర్గ ప్రజలకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. అందరినీ కలుపుకొని వెళ్తున్నారా లేదా అంటూ ప్రశ్నలు అడుగుతూ కాల్స్ వెళ్లాయి. చిట్యాల సర్పంచ్‌పై..
తిరువూరులో దేవదాయ శాఖ అధీనంలో ఉన్న స్థలాన్ని వైసీపీ కౌన్సిలర్ దార నీలిమ భర్త శ్రీనివాసరావు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వివాదాస్పద దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కె.శాంతి అండదండలతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదయింది. ఏ. కొండూరు మండలం కంభంపాడులో నిన్న (మంగళవారం) వైసీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త కాలసాని చెన్నారావు ఇంటిని కూల్చిన ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.