Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
ABN , Publish Date - Apr 05 , 2025 | 10:47 AM
Tiruvuru Politics: తిరువూరులో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను పోటాపోటీగా నిర్వహించేందుకు పూనుకున్నారు కూటమి శ్రేణులు. ఎమ్మెల్యే, ఆర్గానిక్ ప్రొడక్షన్ చైర్మన్ ఇరువురి ఆధ్వర్యంలో జయంతి వేడుకలకు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 5: తిరువూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. తిరువురులో పోటాపోటీగా బాబు జగ్‌జీవన్ రామ్ జయంతి (Babu Jagjivan Ram Jayanti) వేడుకలకు కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరువూరులో ఈరోజు (శనివారం) బాబు జగ్‌జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (MLA Kolikapudi Srinivas), ఆర్గానిక్ ప్రొడక్షన్ చైర్మన్ శావల దేవదత్ ఆధ్వర్యంలో వేడుకలకు ఇరువురు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా తిరువూరులో సాయంత్రం ఎమ్మెల్యే కొలికపూడి కార్యాలయం వద్ద 5 గంటలకు బాబు జగ్‌జీవన్ రామ్ జయంతి వేడుకలు, పీ4 పై అవగాహన సదస్సుకు రావాలంటూ ఎమ్మెల్యే అనుచరులకు సమాచారం ఇచ్చారు.
దీంతో సాయంత్రం జరిగే సదస్సులో ఎమ్మెల్యే ఏం మాట్లాడుతారని కూటమి శ్రేణులు చర్చించుకుంటున్నపరిస్థితి. మొన్న తిరువూరు టీడీపీ కార్యాలయంలో ఈ ఎమ్మెల్యే తమకు వద్దు అంటూ కొలికపూడికి వ్యతిరేకంగా టీడీపీ తిరువూరు నియోజకవర్గం నేతలు సమావేశం అయిన విషయం తెలిసిందే. దీంతో తిరువూరులో ఈరోజు ఏం జరుగుతుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా.. తిరువూరు ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాస్ గెలిపొందారు. అప్పటి నుంచి ఆయన రెచ్చిపోతున్నారని, సొంత పార్టీ నేతలనే పట్టించుకోవడం లేదని, వారికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొలికపూడి వ్యవహరశైలితో ఇబ్బందులు పడుతున్న తిరువూరు టీడీపీ నేతలు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇటీవల కొలికపూడికి వ్యతిరేకంగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ఆధ్వర్యంలో నాలుగు మండలాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేతలకు ఎమ్మెల్యే గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేకు ఉన్న అధికారులు కట్టడి చేసి పార్టీ ఇన్‌చార్జ్‌గా మరొకరికి అవకాశం ఇవ్వాలని తీర్మానించారు తిరువూరు టీడీపీ నేతలు. ఈ వ్యవహారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరగా.. వారిని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సముదించారు. అధిష్టానం నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని శ్రీనివాస్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కొలికపూడిపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయిన విషయం తెలిసిందే. 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానంటూ అధిష్టానానికి కొలికపూడి అల్టిమేటం జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కొలికపూడి వ్యవహార శైలి, కొలికపూడిలో జరుగుతున్న పరిస్థితులపై నివేదిక ఇవ్వాల్సిందిగా నెట్టెం రఘురాం, ఎంపీ కేశినేని, మంతెన సత్యనారాయణను అధిష్టానం ఆదేశించింది. దీంతో తిరువూరులో పర్యటించిన ముగ్గురు కమిటి సభ్యులు తిరువూరులో జరుగుతున్న పరిణామాలు, పార్టీ నేతల అభిప్రాయాలు, కొలికపూడిపై వస్తున్న ఆరోపణలపై నివేదికను సిద్ధం చేసి అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Read Latest AP News And Telugu News