Share News

Tiruvuru MLA Political Controversy: కొలికపూడిని పట్టించుకోని సీఎం

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:38 AM

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడం వివాదం రేపింది. ఆయన ఎన్నోసారి ప్రయత్నించినప్పటికీ, చంద్రబాబు అతన్ని విస్మరించి ముందుకు సాగారు. కొలికపూడి రోడ్డుపై ఇబ్బందులు ఎదుర్కొన్నారు

Tiruvuru MLA Political Controversy: కొలికపూడిని పట్టించుకోని సీఎం

తిరువూరు ఎమ్మెల్యేపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం

చందర్లపాడు, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): వరుస వివాదాలు సృష్టిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్ల గ్రామంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు శనివారం చంద్రబాబు విచ్చేశారు. ఆయనకు మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు హెలిప్యాడ్‌ వద్ద ఎదురేగి స్వాగతం పలికారు. వారిలో కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు పట్టించుకోలేదు. పలుమార్లు కొలికపూడి సీఎం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేదు. కొలికపూడి ఎదురుగా వచ్చినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. అక్కడి నుంచి పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలలో ఒకరి ఇంటికి చంద్రబాబు వస్తున్న సమాచారంతో ఆ ఇంటి వద్ద కొద్ది సేపు వేచి ఉన్న కొలికపూడి అక్కడ ఉన్న ఇతర నేతలతో కలవకుండా దూరంగా ఉన్నారు. చంద్రబాబు రాక ఆలస్యం కావడంతో ప్రజాదర్బార్‌ వేదిక వద్దకు వెళ్లారు. అక్కడ కూడా చంద్రబాబును కొలికపూడి కలిసినట్లు కనిపించలేదు. దీంతో కొలికపూడి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.


ఇవి కూడా చదవండి

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 03:38 AM