Home » Komatireddy Rajgopal Reddy
మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( MLA Rajagopal Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Congress : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నేడు లేదా రేపు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. .
Telangana Elections : గులాబీ బాస్ కేసీఆర్‌ను గద్దె దించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరుల కలయికతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్లన్నీ కాంగ్రెస్ కైవసమేనన్నారు. రాష్ట్రంలో 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Komatireddy Raj Gopal Reddy Nomination : అవును.. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష హాల్లోకి అడుగు పెట్టడానికి వీలుండదు అనే నిబంధన.. పరీక్షలు పెట్టిన ప్రతిసారీ చూస్తుంటాం కదా..! సమయం దాటాక వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చాలానే చూసే ఉంటాం..! ఇప్పుడెందుకు ఇవన్నీ ఇప్పుడేం పరీక్షలు లేవ్.. ఉన్న పరీక్షలనే వాయిదా వేసేశారుగా అనే సందేహం కలిగింది కదూ.. అవును మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే...
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) చూస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గత రాత్రి కాంగ్రెస్ నేత మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. తిరిగి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మరోసారి పార్టీ కండువా కప్పుకున్నారు.ఇందులో భాగంగా కాసేపట్టి క్రితమే కోమటిరెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.
తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు నేతలు జంపింగ్‌లు తెగ చేసేస్తున్నారు. ఇవాళ ఉదయం బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో నేతల జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి పలువురు సిట్టింగ్‌లు, మాజీలు, ముఖ్యనేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు హస్తం వైపు అడుగులేస్తున్నారు. తాజాగా..
అసెంబ్లీ ఎన్నికల వేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం పార్టీకి గట్టి షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతోనే
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరో 40 రోజుల్లో జరగనున్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులు, మేనిఫెస్టోలు, జంపింగ్‌లపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.