Share News

Rajgopalreddy: మాజీ సీఎం ఎన్ని పార్టీలు మారారు?.. అసెంబ్లీలో రాజ్‌గోపాల్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 21 , 2023 | 03:28 PM

Telangana: అధికారంలో పర్మినెంట్‌గా ఉంటాం అనుకున్న బీఆర్‌ఎస్‌కు ప్రజలిచ్చిన షాక్‌కు మతిభ్రమించింది అని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్ నేతల తీర మారడం లేదన్నారు. పార్టీలు మారామని తమ బ్రదర్స్‌ను విమర్శిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా? అని ప్రశ్నించారు.

Rajgopalreddy: మాజీ సీఎం ఎన్ని పార్టీలు మారారు?.. అసెంబ్లీలో రాజ్‌గోపాల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: అధికారంలో పర్మినెంట్‌గా ఉంటాం అనుకున్న బీఆర్‌ఎస్‌కు ప్రజలిచ్చిన షాక్‌కు మతిభ్రమించింది అని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (MLA Rajgopal Reddy) వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్ నేతల తీరు మారడం లేదన్నారు. పార్టీలు మారామని తమ బ్రదర్స్‌ను విమర్శిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా? అని ప్రశ్నించారు. నాలుగు రూపాయలకు దొరికే పవర్‌ను ఆరు రూపాయలకు పెంచి గత ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఆలోచన చేస్తే జాలేస్తోందన్నారు. కిరసనాయిలు దీపం, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రూ.1000 కోట్ల రూపాయలు హైదరాబాదులో బంగ్లా, జిల్లాలో బంగ్లా ఎలా సంపాదించారని నిలదీశారు. తాను పార్టీలు మారింది ప్రజల కోసమే అనిను తాను పదవుల కోసమో, పైసల కోసమో పార్టీలు మారలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి ముందు ఆ పార్టీ నాయకులు మాట్లాడి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి ముందు ధైర్యంగా మాట్లాడలేదు కాబట్టి రాష్ట్రం అప్పుల పాలు అయిందని రాజ్‌గోపాల్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 21 , 2023 | 03:28 PM