Home » Komatireddy Rajgopal Reddy
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలపై ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ యువత, మహిళలు, రైతులు మోదీ గ్యారంటీలనే నమ్ముతారు.
సోనియా గాంధీ(Sonia Gandhi) సభతో కేసీఆర్(KCR) పతనానికి నాంది పలుకుతామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Congress MP Komatireddy Venkatareddy) వ్యాఖ్యానించారు.
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను (BJP Leader Bandi Sanjay) చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatirreddy Rajagopal reddy) భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
భువనగిరి మండలం బండ సోమారం విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించారు. సబ్ స్టేషన్లో కరెంటు సప్లై రిజిస్టర్ని తనిఖీ చేసి సబ్ స్టేషన్ ఆపరేటర్‌తో కోమటిరెడ్డి మాట్లాడారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని సమాచారం అందుతోంది.
కమలం పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు తెలంగాణ బీజేపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేపోతోంది. నిన్నటి దాకా ఒకలా.. ఇప్పుడొకలా పార్టీ తీరు మారిపోయింది. ఉన్నట్టుండి బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించటాన్ని పలువురు సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఉన్నప్పటికీ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఆగిపోయారు.
పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని.. ఊహాగానాలను నమ్మవద్దని తెలిపారు. తన అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్‌కు వివరిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అవును.. ఢిల్లీకి (Delhi) రావాలని తెలంగాణ బీజేపీ నేతలు (BJP Leaders) ఈటల రాజేందర్ (Etela Rajender) , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komati Reddy Rajagopal Reddy) పిలుపొచ్చింది..! రెండ్రోజులకోసారి పార్టీ మారుతున్నారని, బీజేపీలో అసంతృప్తిగానే కొనసాగుతున్నారని వార్తలు వస్తుండటంతో ఈ ఇద్దరి విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని అగ్రనేతలు ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) ఎవరూ లేక ఒంటరిగా ఫీలవుతున్నారా..? ఇప్పుడు ఆయనకు ఎవరూ అండగా లేరా..? పార్టీలో ఉన్న సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాషాయ కండువా (BJP) కప్పుకోగా.. శిష్యుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు ఆయనకు నా అని చెప్పుకునే వాళ్లెవరూ లేకుండా పోయారా..? ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ఇద్దర్నీ ఘర్ వాపసీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారా..?..