Delhi: ఢిల్లీలోనే ఆ ఇద్దరు నేతలు..
ABN , First Publish Date - 2023-06-25T12:28:46+05:30 IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఉన్నప్పటికీ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఆగిపోయారు.
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలంగాణ పర్యటన ఉన్నప్పటికీ బీజేపీ నేతలు (BJP Leaders) ఈటల రాజేందర్ (Eteka Rajendar), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy).. ఆ ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఆగిపోయారు. పార్టీలో మరికొందరు అగ్రనేతలను (Top Leaders) కలిసే ఆలోచనలో ఆ ఇద్దరు నేతలు ఉన్నట్లు సమాచారం.
కాగా జేపీ నడ్డా తెలంగాణ పర్యటనపై బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్‌తో పోరుపై క్లారిటీ ఇవ్వాలంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ వైఖరి మారింది. బీఆర్ఎస్‌తో పోరులో బీజేపీ అగ్రనాయకత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్‌తో కఠినంగా వ్యవహరించకుంటే తెలంగాణలో తీవ్రంగా నష్టపోతామని కమలం పార్టీ నేతలు అంటున్నారు. ఇదే అంశాన్ని ఢిల్లోలో అమిత్ షా, జేపీ నడ్డాలకు ఈటల, రాజగోపాలరెడ్డి వివరించారు. దీంతో నాగర్‌కర్నూల్ సభలో జేపీ నడ్డా ప్రసంగంపై బీజేపీలో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్‌తో పోరుపై జేపీ నడ్డా స్పష్టత ఇవ్వాలని బీజేపీ క్యాడర్ అంటోంది.