Home » Konijeti Rosaiah
కొణిజేటి రోశయ్యలాంటి సహచరుడు మంత్రివర్గంలో ఉంటే.. ముఖ్యమంత్రిగా ఎవరైనా రాణించవచ్చునని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆర్థిక క్రమశిక్షణ వల్లే తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోశయ్య 16 సార్లు ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అవగాహన పెంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని 2007లోనే ఆయన తనకు చెప్పినట్లు వెల్లడించారు.
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి అకాల మరణం నేపథ్యంలో నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య అనూహ్య పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ నాటి పరిస్థితులను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో రోశయ్య పంచుకున్నారు. గతంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో రోశయ్య ఏం మాట్లాడారంటే..