Open Heart With RK: వైఎస్సార్ మరణించాక జరిగిన పరిణామాలను వివరించిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్య
ABN , Publish Date - Feb 16 , 2024 | 10:55 AM
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి అకాల మరణం నేపథ్యంలో నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య అనూహ్య పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ నాటి పరిస్థితులను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో రోశయ్య పంచుకున్నారు. గతంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో రోశయ్య ఏం మాట్లాడారంటే..
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి అకాల మరణం నేపథ్యంలో నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య అనూహ్య పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ నాటి పరిస్థితులను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో రోశయ్య పంచుకున్నారు. గతంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో రోశయ్య ఏం మాట్లాడారంటే..
ఆర్కే: తనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవిని మీరు తన్నుకుపోయారని జగన్మోహన్ రెడ్డి ఫీలవుతున్నప్పుడు సముదాయించడానికి మీరేమైనా ప్రయత్నించారా?
రోశయ్య: నేను మొదట్లో రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత ఊహించని పరిణామాల మధ్య నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. నేను ఢిల్లీలో ఎవరితోనూ టెలిఫోన్‌లో మాట్లాడలేదు. నాతో ఎవరూ మాట్లాడలేదు. నేను పైరవీలు చేయలేదు. ఎవరి ఉహకు అందని పరిస్థితుల్లో అవకాశం వచ్చింది. పరామర్శకు వచ్చినప్పుడు కూడా సోనియా గాంధీ చెప్పలేదు. సాయంత్రం 3 గంటల సమయంలో ఫోన్ చేసి సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకారం చేయమని హైకమాండ్ ఆదేశించింది. పృథ్వీరాజ్ చౌహాన్, వీరప్ప మొయిలీ కూడా ఇక్కడికి వచ్చి పిలిచి మాట్లాడారు. 4 గంటల్లోగా రాజ్‌భవన్‌కు వచ్చేయాలని సూచించారు.
ఇది తాత్కాలికమైన ఏర్పాటని ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి చెప్పాను. ఆ తర్వాత విజయమ్మ (రాజశేఖర్ రెడ్డి భార్య) గారిని కలిసి దు:ఖంలో ఆమెను ఓదార్చాను. పోయిన రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకురావడం మా ఎవరి వల్ల కాదు. ఈ రాష్ట్రానికి, మాకు దురదృష్టకరం. వారు లేకపోయినా మంచి కానీ, చెడు కానీ మేమందరం ఉన్నాం. మీరెప్పుడు ఏ విషయం ఉన్నా చెప్పొచ్చు అన్నాను. కానీ మౌనమే ఆమె సమాధానం. కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంటా ఉంది. ఆవిడ దగ్గర నుంచి సమాధానం కూడా ఆశించలేం.
అలాగే జగన్‌మోహన్ రెడ్డిని కూడా కలిసి ప్రత్యక్షంగా మాట్లాడాను. తండ్రిని కోల్పోవడం మీకు పెద్ద వెలితి. మా అందరికి కూడా బాధ అని చెప్పాను. ఓదార్చినప్పుడు జగన్ ఓకే.. అలాగే అన్నారు. చర్చించడానికి అది పెద్ద సమయం కూడా కాదు. అయితే ఆయనకు అనుకూలంగా కొంతమంది సంతకాలు పెట్టారని వినపడింది. సంతకాలు పెట్టిన విషయం గురించి నేను ఎవరినీ అడగలేదు. నాకు కూడా ఎవరూ చెప్పలేదు. చాలా మంది సంతకాలు పెట్టారని తర్వాత తర్వాత తెలిసింది. సీఎల్పీ సమావేశం జరగడానికి కూడా కొంత సమయం ఉంది. అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారే వచ్చి ప్రతిపాదన చేశారు. ఆయన సమీకరణాలు, విశ్లేషణలు వేరు.
అందుకే సీఎం పదవి తనకు రవాల్సిందని అనుకున్నారు. అందుకే ఆయన కొంచెం దూరం దూరంగా ఉన్నాడు. తర్వాత ఒకసారి వచ్చి మాట్లాడాడు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులను కొనసాగించడమే నా పని తప్ప. నాకంటే ప్రత్యేకంగా కొత్త పథకాలు అక్కర్లేదు అని చెప్పాను. అయినప్పటికీ జగన్ సంతృప్తి చెందలేదు.
మరిన్ని వివరాల కోసం కింద ఉన్న వీడియోపై క్లిక్ చేయండి..