Home » Kothagudem
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. కొత్తగూడెంలోని ఓ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని శుక్రవారం బడికి వెళ్లేందుకు నిరాకరించింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన.. బుధవారమంతా కొనసాగింది. కొన్ని చోట్ల అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షం పడడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు(Seetharama Project) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
అవి 58 ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గుర్తులు.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్తు వెలుగులు అందింది అక్కడి నుంచే.. తొలి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది అక్కడే.. 100 మీటర్లపైన పొడువుతో ఎంతో గంభీరంగా కనపడే పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) కూలింగ్ టవర్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టుకు గండ్లు పడి... నీరంతా దిగువ ప్రాంతాలను ముంచెత్తడంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) స్పందించింది. ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ను) ఆదేశించింది.
మణుగూరుతోపాటు సబ్ డివిజన్ ప్రజలు వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ రాఘవరెడ్డి సూచించారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి(DSP Ravinder Reddy) విలేకరులతో మాట్లాడారు.
ఒకవైపు ఎడతెరిపి లేని వర్షం.. మరోవైపు ఆకస్మికంగా వచ్చి పడిన వరద.. ఇంతలో మొరాయించిన ప్రాజెక్టు గేటు.. కట్టకు గండ్లు.. దాని పైనుంచి ప్రవాహం.. ఏ క్షణంలోనైనా తెగి ఊళ్లు మునిగే ప్రమాదం..! మధ్యలో చిక్కుకుపోయిన ప్రజలు..!
కృష్ణా బేసిన్లో ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని కీలక ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండు కుండలా మారాయి. ఆల్మట్టి గేట్లను మంగళవారమే తెరవగా.. బుధవారం నారాయణ పూర్ గేట్లను తెరిచారు. ఆ ప్రాజెక్టు నుంచి సాయంత్రం 62,955 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
సింగరేణి ప్రాంతంలో 18 వేలకు పైగా మొక్కలు నాటించి, 6 జిల్లాల్లో 35 చిట్టడవులను పెంచడంలో కీలకంగా వ్యవహరించినందుకుగాను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ట్రీ మాన్ ఆఫ్ తెలంగాణ అవార్డును అందుకున్నారు.
మణుగూరు మండలం బావి కూనవరం(Bavi Koonavaram) గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత(Padma Shri awardee) సకిని రాంచంద్రయ్య (Sakini Ramchandraiah) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో స్వగ్రామంలోనే ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.