Share News

Mukkoti Ekadashi: భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు

ABN , Publish Date - Jan 10 , 2025 | 07:58 AM

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

Mukkoti Ekadashi: భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు
Bhadradri Ramaiah

భద్రాద్రి కొత్తగూడెం: వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా శుకరవారం భద్రాద్రి (Bhadradri)లో ఘనంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారంలో శ్రీ మహా విష్ణువు(Lord Vishnu) రూపంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి (Sri Seetharama Chandra Swamy) వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswararao) పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కరకట్ట, రామాలయ పరిసర ప్రాంతాలు, సూపర్‌బజారు సెంటర్, బ్రిడ్జి పాయింట్‌లో భక్తులకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో హంసవాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ రామచంద్రస్వామి రోజుకో అలంకారంలో బక్తులకు దర్శనమిస్తారు.


యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శుక్రవారం తెల్లవారుజాము 5.28 గంటల నుంచి గరుడ వాహనం పై లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి క్యూలైన్లలో నిలుచున్నారు.

సిద్దిపేట జిల్లాలో వైష్ణవాలయాలు కిటకిట...

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుంటే పుణ్యప్రదం అని భక్తుల భావన. సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠద్వార దర్శనం ప్రారంభమైంది. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ నాథున్ని దర్శనం చేసుకుంటున్నారు.


నల్గొండలో ముస్తాబైన ఆలయాలు..

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ, పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి. ఉత్తర దర్శనం ద్వారా స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయాల్లో క్యూలైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

సంగారెడ్డి జిల్లాలో...

ముక్కోటి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డిలోని వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి గోధాసమేత విరాట్‌ వెంకటేశ్వర ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలుచున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు..

అప్పుడు ఇల్లే వైకుంఠం

చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 10 , 2025 | 07:58 AM