Home » Kothagudem
విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. పీకల దాక తాగి స్కూళ్లకు వస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్‌నగర్ కాలనీ ప్రైమరీ స్కూల్లో పత్తిపాతి వీరయ్య ఎస్జీటీగా పనిచేస్తున్నాడు.
ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని 100 కి.మీల దూరంలో ఉన్న ఇంటికి తిప్పి పంపేశారు ఓ మాతాశిశు సంరక్షణ కేంద్రం అధికారులు. ఆ తర్వాత కొన్ని గంటలకే నొప్పులు ఎక్కువవడంతో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో 108 వాహనంలోనే ఆ గర్భిణికి ప్రసవమైంది.
జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలల పునఃప్రారంభం సహా పలు అంశాలపై కొత్తగూడెం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో తాగునీటి విపరీతంగా ఉందని.. బుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థలు ఆందోళనకు దిగారు.
స్థానిక నర్సింగ్ కళాశాల విద్యార్థిని కారుణ్య (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమె బంధువులు.. కళాశాల ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని.. అలాగే నర్సింగ్ కళాశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటే చైతన్య గడ్డ అయిన కొత్తగూడెం ప్రజలు ప్రతిపక్షం వైపు నిలబడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. .వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్లో సోమవారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో పోలింగ్ వేళ అపశృతి చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరుకానున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిసాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలసాయి. మార్చి 8 వ తేదీన 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాలద్వారా పిలుపిచ్చారు.
గత కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. కోల్ బ్లాక్ ఆక్షన్‌లో పాల్గొనకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి నష్టం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ బ్లాక్ ఆక్షన్‌లో తప్పకుండా పాల్గొంటుందని తెలిపారు.