TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ABN , Publish Date - Oct 17 , 2024 | 07:54 AM
మావోయిస్ట్ పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పన పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కొత్తగూడెంలోని హాస్పిటల్‌కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు తెలియవచ్చింది. కాగా మహబూబాబాద్ బస్టాండ్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మావోయిస్ట్ పార్టీకి (Maoist Party) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మహిళా అగ్రనేత సుజాత (Sujatha) అలియాస్ కల్పన (Alias Kalpana) పోలీసుల (Police) అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆమె మావోయిస్ట్ దివంగత అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు (Mallojula Koteswara Rao) అలియాస్ కిషన్ జీ (Kishan Ji) భార్య. ఆమెను కొత్తగూడెంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సుజాతను పోలీసులు హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. ఆమెపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత వైద్యం కోసం కొత్తగూడెం హాస్పిటల్‌కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు తెలియవచ్చింది. కాగా మహబూబాబాద్ బస్టాండ్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది. సుజాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్‌లో కార్యకలాపాలు చూస్తున్న సుజాత తెలంగాణ పోలీసులకు చిక్కినట్లు సమాచారం.
కాగా సుజాత భర్త కిషన్‌జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న సమయంలో 2011లో పశ్చిమ బెంగాల్ జార్‌గ్రామ్‌లోని బురిషోల్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. కిషన్ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆయన సోదరుడు సైతం మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అతను అజ్ఞాతంలో ఉన్నారు. సుజాత కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తర్వాత పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 60 సంవత్సరాలు. అయితే సుజాత అరెస్టుపై పోలీసు వర్గాలు అధికారిక ప్రకటన చేయలేదు.
సుజాత వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలు రావడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే సమాచారం. మరోవైపు ఇటీవల దండకారణ్యం, అబూజ్‌మఢ్ అడవుల్లో పోలీసులు, భద్రతా దళాల నిర్బంధం పెరిగిపోయింది. ఈ క్రమంలో సుజాత మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంకు వస్తుండగా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలియవచ్చింది. కాగా సుజాత తనకు తానుగా లొంగిపోయారా.. లేక సమాచారం తెలుసుకున్న పోలీసులే అదుపులోకి తీసుకున్నారా అనే దానిపై స్పష్టత లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
దక్షిణకోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఎక్కడి వారు అక్కడికి వెళ్లాల్సిందే!
చంద్రబాబు రక్షణకు సీఆర్‌పీఎఫ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News