Home » Kutami
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పూర్తిస్ధాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారాల ఏపీ వార్షిక బడ్జెట్ను సభముందు ఉంచుతున్నానని.. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమయిన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అయితే సమావేశాలు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అసెంబ్లీకి వెళ్లే తొలి రోజు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం అసెంబ్లీకి వెళ్లే ఆనవాయితీ... ఈ సందర్భంగా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఏపీ పోలీసుల వరుస చర్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సోషల్ సైకోలు పలువురు ఏపీని విడిచి పారిపోతున్నారు. మరి కొందరు ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చెయ్యం. వదిలిపెట్టండి అని పోలీసులను వేడుకుంటున్నారు. ఇంకొందరు భయంతో న్యాయవాదుల్ని వెంట బెట్టుకుని ఠాణాలకు వచ్చి రక్షణ కోరుతున్నారు.
ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 ను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024 ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదాన్ని తెలియచేసే అవకాశముంది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.
కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ 2024 మంగళవారం ఉదయం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో ప్రకటించినట్లు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాథి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వ నూతన విధానాలు రూపొందిస్తోంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుట్టింది. ఆయా శాఖల అధికారులు మూడు నెలల పాటు కొత్త పాలసీలపై విస్తృత కసరత్తు చేసి పాలసీలు సిద్దం చేశారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు చేస్తూ.. ‘న్యాయ మిత్ర’గా మార్చింది. లా డిపార్ట్మెంట్లో అమలవుతున్న ఈ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్చాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేయబడతాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరి లోని సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది.
న్యూఢిల్లీ: ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ సీఎం ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లు నిండాయని, ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం అయ్యింది ఒక్కటి లేదని, సగం పైగా పునాదుల దశలోనే ఉన్నాయని విమర్శించారు.
విజయనగరం జిల్లా: రామభద్రాపురంలో మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఎస్కార్టు వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం వ్యాన్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న ముగ్గురుతోపాటు ముగ్గురు గన్మెన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.