Minister Narayana: ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం..
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:45 AM
ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనతో ఏపీ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాజధాని అమరావతిని అసలు పట్టించుకోలేదని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఐఐటీ మద్రాస్‌ను పిలిపించి భవనాల నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు.

అమరావతి: ఏపీ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati)లో మంత్రి నారాయణ (Minister Narayana) మంగళవారం పర్యటించారు. ఇప్పటికే పలు పనులకు టెండర్లు ప్రక్రియ (Tenders process) పూర్తి చేశారు. నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలను, సీఆర్డీఏ (CRDA) ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరమని, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమేనని అన్నారు. గత టీడీపీ (TDP) హాయంలో రూ. 43 వేల కోట్లకు టెండర్లు పిలిచామని, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
Also Read..: మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు..
కానీ గత ప్రభుత్వం (జగన్ సర్కార్) ఇవేమీ పట్టించుకోలేదని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఐఐటీ మద్రాస్‌ను పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు. 90 శాతం పనులు టెండర్లు పూర్తి అయ్యాయన్నారు. మొదట క్లీనింగ్‌తో పనులు మొదలు అయ్యాయన్నారు. ఇవాళ సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ కార్యదర్శి బంగళాలు పరిశీలించామన్నారు. 186 బంగాళాలు మంత్రులు, జడ్జీలు, కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులకు వస్తున్నాయన్నారు. గెజిటెడ్ అధికారులకు 1440,ఎన్జీవోలకు 1995 నిర్మాణాలు వస్తున్నాయని తెలిపారు. అలాగే హై కోర్ట్ 16.85 లక్షల చదరవు అడుగులు వస్తుందన్నారు. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో ఉంటుందని, 15 రోజుల్లో కాంట్రాక్టర్ల మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని నారాయణ తెలిపారు.
ప్రజలపై ఒక్క పైసా భారం కూడా లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని, వరల్డ్ బాంక్.. ఎడిబి నుంచి రుణాలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత. అప్పు తీర్చడం జరుగుతుందన్నారు. ప్రజల డబ్బు వృధా చేస్తున్నారని ప్రతిపక్షం చెబుతోందని.. ఇది సరికాదని మంత్రి అన్నారు.
మరోవైపు విశాఖ జిల్లా, భోగాపురం ఎయిర్ పోర్ట్ రోడ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. ఇందుకోసం రోడ్ల విస్తరణ చేయాల్సి ఉందని అన్నారు.ఈ ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, ఇతర ట్రాఫిక్ సమస్యలపై నాలుగు రోజుల క్రితం విశాఖ స్థానిక నేతలతో చర్చించామన్నారు. వీఎంఆర్డీఏ పరిధి మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష చేశామని తెలిపారు. ఫైనల్ చేసిన మాస్టర్ ప్లాన్‌ను ఆన్‌లైలో ఉంచుతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ నాలుగు నెలల్లో ఫైనల్ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ అంటే రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని చేయాలని చెప్పారు. కొన్ని చోట్ల రోడ్ల పరిధిని పెంచడంపై అధికారులతో చర్చించినట్లు చెప్పారు. మెట్రో రైల్ కూడా మాస్టర్ ప్లాన్‌లో భాగమేనని తెలిపారు. 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లై ఓవర్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ డబుల్ డెక్కర్ రోడ్లు ప్లాన్ చేసేలా ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారని అన్నారు. టీడీఆర్ బాండ్ల విషయం అందరికీ తెలుసునని.. టీడీఆర్ బాండ్లపై అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
పోలీస్ వాహనంపై రాళ్లతో ఆందోళనకారుల దాడి
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
For More AP News and Telugu News