Home » Lalu prasad yadav
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన-యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచ్చేశారు.
మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆగస్ట్‌లో కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ జరగవచ్చునన్నారు.
యజమానుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయంగా వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌పై సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసింది.
బిహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీకి త్రుటిలో ప్రమాదం తప్పింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీల దృష్టి యూపీ, బీహార్‌పైనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించడం కోసం ఎన్డీయే, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. యూపీతో పోలిస్తే బీహార్ రెండు కూటములకు కీలకంగా మారింది.
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాను స్వాగతిస్తానని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అయితే, రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఉండకూడదన్నారు. సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇవ్వాలన్నారు.
బీహార్‌లోని దర్బంగాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల సభలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటు విమర్శలు చేశారు. 2002 గోద్రా రైలు దహనం ఘటనను ప్రస్తావిస్తూ, కరసేవకులను సజీవ దహనం చేసిని వారిని రక్షించేందుకు లాలూ ప్రయత్నించారని ఆరోపించారు.
బిహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్‌లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.
లోక్‌సభ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో తమ పార్టీ అధికారంలోకి వస్తే ''నూతన రాజ్యాంగ'' రూపకల్పన చేస్తామంటూ బీజేపీ నేతలు పదేపదే వల్లిస్తున్నారని, వారిని మోదీ అదుపు చేయలేకపోతున్నారని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరచేందుకు ఎవరు ప్రయత్నించినా ప్రజలు వాళ్ల కళ్లను పెరికివేస్తారని ఆయన హెచ్చరించారు.