Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్యం ఆందోళనకరం.. నిమ్స్‌లో చేరే అవకాశం
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:46 PM
లాలూ యాదవ్‌కు గత రెండ్రోజులుగా ఆరోగ్యం బాగోలేదు. బుధవారం ఉదయం పరిస్థితి మరింత దిగజారడం కుటుంబసభ్యులు, మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చాలాకాలంగా ఆయన వైద్యచికిత్సలు తీసుకుంటుండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు.

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అస్వస్థతకు గురయ్యారు. బ్లడ్ షుగర్ ఎక్కువ కావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. రొటీన్ చెకప్‌లలో బ్లెడ్ షుగర్స్ లెవెల్స్ ఆందోళనకరంగా ఉన్నట్టు మెడికల్ రిపోర్టులు రావడంతో తదుపరి చికిత్స కోసం ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చనున్నారు.
Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
లాలూ యాదవ్‌కు గత రెండ్రోజులుగా ఆరోగ్యం బాగోలేదు. బుధవారం ఉదయం పరిస్థితి మరింత దిగజారడం కుటుంబసభ్యులు, మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చాలాకాలంగా ఆయన వైద్యచికిత్సలు తీసుకుంటుండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయన ముంబైలో హృద్రోగ సమస్యలతో యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నారు. దానికి ముందు, 2022లో సింగపూర్‌లో ఆయన కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీకి ఆయనకు డొనేట్ చేశారు. 2014లో లాలూకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది.
భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కుంభకోణం కేసులో లాలూపైన, ఆయన కుటుంబ సభ్యులపైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి మార్చి 19 సుమారు నాలుగు గంటల సేపు ఈడీ ఆయనను ప్రశ్నించింది. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఆర్జేడీ కార్యకర్తలు పెద్దఎత్తున లాలూకు అనుకూల నినాదాలు చేయడం రాజకీయంగానూ వేడిపుట్టించినట్టు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?
Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
For National News And Telugu News