Home » Lavu Sri Krishna Devarayalu
Andhrapradesh: పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఒక పత్రికలో ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం ఉంది అని రాశారన్నారు. తమకు ఎస్పీ బిందు మాధవ్‌కు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఎస్పీతో ఫోన్ కూడా మాట్లాడలేదన్నారు.
పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం వెళ్లడంతో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది. అయితే ఇక్కడ ఎస్పీ బిందు మాధవ్‌తో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు సంబంధాలున్నాయంటూ ఓ పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దానిపై ఆయన స్పందించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ(YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పలు కుట్రలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో మరోసారి వైసీపీ మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సభ వేదిక కూల్చేందుకు వైసీపీ కుట్రకు తెరదీసింది.
టీడీపీ క్యాడర్‌ను ఎంత అణగదొక్కిన అంతకు రెండు రెట్లు పైకి వస్తారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితులకు అండగా ఉంటాం, అన్ని విదాలుగా న్యాయం చేస్తామని మాటిచ్చారు.
తనపై సోషల్ మీడియాలో వైసీపీ (YSRCP) నేతలు విషప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. శనివారం నాడు సచివాలయంలోని సీఈఓ ఆఫీసుకు వచ్చారు. తనపై సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారంపై అడిషనల్ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు. ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలుగా తనపై వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయ్. ఈ ఎన్నికల్లో ఏం చేసైనా సరే గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదని టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి వ్యూహ రచనలు చేస్తున్నాయ్. ఇందుకోసం ఏ చిన్నపాటి చాన్స్ వచ్చినా అటు టీడీపీ.. ఇటు వైసీపీ (YSR Congress) వదులుకోవట్లేదు. ఓ వైపు అభ్యర్థులను ప్రకటించి వైసీపీ దూకుడు మీదుంటే.. తగ్గేదేలే అంటూ..
పల్నాడు జిల్లా: పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన (శనివారం) తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు గురజాలలో జరిగే ‘రా కదలి రా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు.
YSRCP Vs TDP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మధ్యే వైసీపీకి రాజీనామాకు చేసిన యంగ్ ఎంపీ.. తిరిగి పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసిన ఆయన.. మనసులోని మాటను బయటపెట్టారు. అవును.. మళ్లీ వైసీపీలో చేరే ఉద్దేశమే లేదని.. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు...
పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్ కార్యాచరణపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆయన ఏ పార్టీలో చేరతారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది
ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు నేడు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లావు శ్రీ కృష్ణ దేవరాయులు బాటలోనే మరికొంత మంది పల్నాడు వైసీపీ కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.