AP Election 2024: దేనికైనా నేను సిద్ధమే.. లావు శ్రీకృష్ణదేవరాయులు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - May 20 , 2024 | 07:29 PM
పల్నాడు ఎస్పీ బింధుమాదవ్, తమ కుటుంబాలకు చుట్టరికం ఉందని చెబుతూ సాక్షిపత్రిక, మీడియా అసత్య కథనాలు రాస్తుందని నర్సారావు పేట కూటమి ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. తన వైపు నుంచి ఏ సమాచారం కావాలన్న ఇస్తామని అన్ని విధాలా అధికారులకు సహకరిస్తానని చెప్పారు.
అమరావతి: పల్నాడు ఎస్పీ బింధుమాదవ్, తమ కుటుంబాలకు చుట్టరికం ఉందని చెబుతూ సాక్షిపత్రిక, మీడియా అసత్య కథనాలు రాస్తుందని నర్సారావు పేట కూటమి ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. తన వైపు నుంచి ఏ సమాచారం కావాలన్న ఇస్తామని అన్ని విధాలా అధికారులకు సహకరిస్తానని చెప్పారు.
తన ఫోన్లు కావాలంటే హ్యాండ్ ఓవర్ చేయడానికి సైతం తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. అటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని విచారణ చేయాలని కోరారు. నేటికి పల్నాడులో సాక్షిపత్రిక, మీడియా విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. కల్పిత కథనాలు ద్వారా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపుతోందని ఫైర్ అయ్యారు.
సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి పల్నాడులో జరిగిన అల్లర్లపై సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు.పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన పరిణామాలు హింసాత్మక సంఘటనలపై సీఈఓ ఎంకే మీనాకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.తెలుగుదేశానికి అనుకూల పోలింగ్ బూత్‌ల్లో తక్కవ సెక్యూరిటీ పెట్టారని.. వైసీపీ బూత్‌ల వద్ద ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని చెప్పారు. పోలింగ్ రోజు పోలీసులు తమకు సహకరించారనే ఆరోపణలు చేస్తున్నారని.. అయితే నిజానికి ఇబ్బందులు పడ్డదే తామేనని తేల్చిచెప్పారు. నిజానికి ఇక్కడ ఎన్నికలు చేసింది మాత్రం పల్నాడు జనం, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు చేశారన్నారు.
ఏపీలో 86శాతం పోలింగ్ జరిగింది అంటే ప్రజలు దైర్యంగా వచ్చి ఓటేయడమేనని చెప్పుకొచ్చారు. పోలింగ్ రోజు కూడా పోలీసుల ద్వారా తమకు ఎలాంటి సహకారం లభించలేదన్నారు. పోలింగ్ రోజున ముందు తన కాన్వాయిపైనే దాడి జరిగిందని చెప్పారు. సాక్షి మీడియా, సోషల్ మీడియాలో నేటికి వైసీపీ నేతలు అసత్య కథనాలు వండి వార్చుతున్నారని ధ్వజమెత్తారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో అధికారుల వైపు నుంచి తప్పు ఉంటే వాటిని ఇన్ వ్యాలిడ్ చెయెద్దన్నారు. మాచర్లలో 75మంది కార్యకర్తలు, నాయకులు ఆస్పత్రుల్లో ఉన్నారని.. వీరిలో అన్ని కులాలు వారు ఉన్నారని అన్నారు. సిట్ వారిని కూడా విచారించి న్యాయం చేయాలని లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!
జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే
చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News