TDP: యంగ్ ఎంపీలకు సీఎం చంద్రబాబు అరుదైన అవకాశం..!
ABN , Publish Date - Jun 22 , 2024 | 09:02 PM
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి సీఎం నారా చంద్రబాబు నాయుడు యంగ్ ఎమ్మెల్యేలను తీసుకున్న సంగతి తెలిసిందే. యువతకు టికెట్లు ఇవ్వడమే కాదు.. వారిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావడం.. మంత్రులుగా తీసుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా యంగర్స్‌కు బాబు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) యంగ్ ఎమ్మెల్యేలను తీసుకున్న సంగతి తెలిసిందే. యువతకు టికెట్లు ఇవ్వడమే కాదు.. వారిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావడం.. మంత్రులుగా తీసుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా యంగర్స్‌కు బాబు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఇద్దరు యంగ్ ఎంపీలకు చంద్రబాబు అరుదైన అవకాశం కల్పించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. జాగ్రత్తగా వ్యవహరించాలని తగు సూచనలు, సలహాలు చేశారు సీఎం. దీంతో ఆ ఇరువురు ఎంపీలు, వారి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు.
జగన్‌కు ఊహించని పరిణామం
ఇదీ అసలు సంగతి!
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలును చంద్రబాబు ఎంపిక చేశారు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బైరెడ్డి శబరికి అవకాశం కల్పించారు. ఇక కోశాధికారిగా దగ్గుమల్ల ప్రసాద్‌ను నియమించడం జరిగింది. లావు.. నరసారావుపేట నుంచి రెండోసారి ఎంపీగా గెలవగా.. శబరి తొలిసారి గెలిచారు. ఈ ఇద్దరూ కూడా ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వారే. ఇక దగ్గుమల్ల ప్రసాద్.. చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన ఈయన.. రాధే కన్‌స్ట్రక్షన్స్ నడిపిస్తున్నారు. శనివారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలసేపు కొనసాగిన ఈ సమావేశంలో.. మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను ఎన్నుకోవడం జరిగింది.
వైసీపీ ఘోర ఓటమికి ఒక్క మాటలో కారణం చెప్పిన కేకే సర్వే
దిశానిర్దేశం..!
ఈసారి లోక్‌సభలో టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీ ప్రథమ కర్తవ్యం కావాలని చంద్రబాబు సూచించారు. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసికట్టుగా ఎంపీలు అందరూ ఉండాలని.. ఏ మాత్రం సందేహాలున్నా సరే వెంటనే తనకు తెలియజేయాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎంపీలకు చంద్రబాబు చెప్పారు. కాగా.. ఇదే సమావేశంలో ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై లోతుగా చర్చించడం జరిగింది.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..