Home » Liquor Lovers
యాడికి మండలంలో నాటు సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారికి నాయకులు ‘నాటు’ మంత్రం వేస్తున్నారు. ప్రభుత్వ మద్యం కొనాలంటే ఖర్చు ఎక్కువ. అందుకే.. ఖర్చు తక్కువ.. కిక్కు ఎక్కువ అనుకుని.. పేదల ఆరోగ్యాన్ని పాడు చేసేందుకు పూనుకున్నారు. మరోవైపు జె-బ్రాండ్ మద్యం అంతా రాజకీయ నాయకులకే సరిపోతోందని మద్యం ప్రియులు నాటు బాట పట్టారు.
ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రై కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లుకాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు..
బిహార్ రాష్ట్రంలో మద్యపానం పూర్తిగా నిషేధం. కానీ రాష్ట్రంలో రోజుకో కొత్త మార్గాల్లో మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. అయితే ఎడ్ల బండిలో మద్యం రవాణా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ఓ ప్రాంతంలో న్యూ ఇయర్ సందర్భంగా 7వ తరగతి విద్యార్థులు మద్యం సీసాలతో కనిపించారు. ఈ సంఘటన డిసెంబర్ 31న జరుగగా అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోకి మద్యం రవాణా చేయడానికి కేటుగాళ్లు కొత్త దారులను తొక్కుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఎలాగైనా సరే మద్యం చేరవేయడమే లక్ష్యంగా పని చేస్తున్న పలువురు అందుకోసం కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు.
Liquor Rates Hike In Andhra Pradesh : వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధిస్తామని పదే పదే చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) .. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇదే మద్యాన్నే ఆదాయంగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నారు..