Home » Lok Sabha Elections
ప్రతి 5 సంవత్సరాలకొకసారి జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. 2009 నుండి 2024 వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య 104 శాతం పెరిగిందని పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) విశ్లేషించింది.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పూర్వాంచల్ ప్రాంతంలోని ఘోసిలో జరిగిన లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రచారంలో ఆయన మాట్లాడారు.
ఆమె సినిమా ‘క్వీన్’.. ఆయన ఒకనాటి రాజ్యానికి వారసుడు..! వీరి మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ కాక పుట్టిస్తోంది. ఇద్దరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తూ ఆదరణ చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం మండి. ఇక్కడినుంచి బీజేపీ
ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చెబితే గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ.. ఆ ఇద్దరు ఓటు ఎవరికి వేస్తారని ఎవరిని అడిగినా వెంటనే వచ్చే సమాధానం కాంగ్రెస్ పార్టీ.. హస్తం గుర్తు.. కానీ ఈ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలు హస్తం గుర్తుకి ఓటు వేయలేదు.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. లోక్‌సభకు శనివారం జరుగుతున్న 6వ దశ పోలింగ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.
లోక్ సభ ఆరో దశ ఎన్నికలు(Lok Sabha election 2024) జరుగుతున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) ఎక్స్ అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.
దేశాభివృద్ధికి పాటు పడే వారికే ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ(PM Modi) ఉద్ఘాటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) పర్యటించారు.
అధికారం కోసం విపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ఎంతకైనా తెగిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.