Share News

ADR: 15 ఏళ్లలో 104 శాతం పెరిగిన రాజకీయ పార్టీలు.. ఏడీఆర్ నివేదికలో ఆసక్తికర విషయాలు

ABN , Publish Date - May 30 , 2024 | 07:32 AM

ప్రతి 5 సంవత్సరాలకొకసారి జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. 2009 నుండి 2024 వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య 104 శాతం పెరిగిందని పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) విశ్లేషించింది.

ADR: 15 ఏళ్లలో 104 శాతం పెరిగిన రాజకీయ పార్టీలు.. ఏడీఆర్ నివేదికలో ఆసక్తికర విషయాలు

ఢిల్లీ: ప్రతి 5 సంవత్సరాలకొకసారి జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. 2009 నుండి 2024 వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య 104 శాతం పెరిగిందని పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) విశ్లేషించింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో 677, 2014లో 464, 2009లో 368 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనగా.. 2024 ఎన్నికల్లో 751 రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయని తెలిపింది. ఏడీఆర్ 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 8,337 మంది అభ్యర్థుల స్వీయ ప్రమాణ పత్రాలను పరిశీలించింది. పోటీ చేస్తున్న 8,360 మంది అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పార్టీలు, 532 మంది ప్రాంతీయ పార్టీలు, 2,580 మంది గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు, 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నట్లు గుర్తించింది.


అభ్యర్థుల్లో క్రిమినల్ కేసులు..

జాతీయ పార్టీలు : 1,333 మంది అభ్యర్థుల్లో 443 మందిపై క్రిమినల్ కేసులు. 295 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

ప్రాంతీయ పార్టీలు : 532 మంది అభ్యర్థుల్లో 249 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 169 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

గుర్తింపు లేని పార్టీలు : 2,580 మంది అభ్యర్థుల్లో 401 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 316 మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

స్వతంత్ర అభ్యర్థులు : 3,915 మంది అభ్యర్థుల్లో 550 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 411 మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆస్తులు..

8,337 మంది అభ్యర్థులలో 2,572 మంది కోటీశ్వరులు ఉన్నారు.

జాతీయ పార్టీలు : 1,333 మంది అభ్యర్థుల్లో 906 మంది కోటీశ్వరులు.

ప్రాంతీయ పార్టీలు : 532 మంది అభ్యర్థుల్లో 421 మంది కోటీశ్వరులు.

గుర్తింపు లేని పార్టీలు : 2,580 మంది అభ్యర్థుల్లో 572 మంది కోటీశ్వరులు.

స్వతంత్ర అభ్యర్థులు : 3,915 మంది అభ్యర్థుల్లో 673 మంది కోటీశ్వరులు.

For Latest News and National News click here..

Updated Date - May 30 , 2024 | 07:32 AM