Share News

Lok Sabha Polls 2024: నెమ్మదిగా సాగుతున్న పోలింగ్..కారణం అదే..!

ABN , Publish Date - May 25 , 2024 | 11:17 AM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.

Lok Sabha Polls 2024: నెమ్మదిగా సాగుతున్న పోలింగ్..కారణం అదే..!
Voters

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. పోలింగ్ బూత్‌ల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈవీఎంలు పనిచేయడం లేదంటూ ఎన్నికల సంఘానికి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. పశ్చిమ బెంగాల్‌, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌-రాజౌరీ, ఒడిశాలోని పూరీ లోక్‌సభ స్థానంలో ఈవీఎంలు పనిచేయడం లేదంటూ వివిధ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఢిల్లీలో పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని.. ఓటింగ్‌ వేగంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కోరారు. . ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌ ప్రక్రియ చాలా స్లోగా జరుగుతోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అతిషి అన్నారు. చాందినీ చౌక్‌లోని ఢిల్లీ గేట్ ప్రాంతంలోని పోలింగ్ బూత్ వద్ద భారీ క్యూ ఉందని, గత 2 గంటలుగా ఇక్కడ EVM పనిచేయలేదని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు.

PM Modi: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ ముఖ్యమే.. ఆరో దశ ఎన్నికల వేళ మోదీ ఆసక్తికర పోస్ట్


ఢిల్లీలో మొరాయించిన ఈవీఎంలు

ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని ఢిల్లీ గేట్‌ బూత్‌లో కూడా ఈవీఎం పనిచేయడంలేదని ఈసీకి ఫిర్యాదు అందింది. ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటు వేసేందుకు మండుటెండలో ప్రజలు క్యూలో నిల్చున్నారు. ఓటు వేయడానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఒడిశాలోని పూరిలో..

ఒడిశాలోని పూరీ లోక్‌సభ స్థానంలో చాలా పోలింగ్ బూత్‌లలో ఈవీఎం మిషన్లు పనిచేయడం లేదని బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవీఎం మెషిన్లు పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొంతమంది ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని.. తక్షణమే సమస్యను పరిష్కరించాలని సంబిత్ పాత్ర ఎన్నికల అధికారులను కోరారు. ఈవీఎం యంత్రాలు మొరాయిస్తున్న పోలింగ్ బూత్‌లలో ఓటు వేసేందుకు నిర్దేశించిన సమయాన్ని పొడిగించాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు.


జమ్మూకశ్మీర్‌లో..

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం పరిధిలోని చాలా బూత్‌లలో ఈవీఎంల ట్యాంపరింగ్, రిగ్గింగ్ జరుగుతోందని పీడీపీ అభ్యర్థి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే పీడీపీ పోలింగ్ ఏజెంట్లను పోలీస్ స్టేషన్‌లో బంధించారని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఈవీఎంలు పనిచేయకపోవడంపై అందుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరిస్తున్నామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చిన ప్రతి ఓటరుకు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.


బుజ్జగింపులు, అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయాలి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read National News and Latest News here

Updated Date - May 25 , 2024 | 11:20 AM