Home » Lok Sabha Polls 2024
Model Code of Conduct: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ ముగిసింది. దీంతో హమ్మయ్య ఇక ఎన్నికల కోడ్(Election Code) ముగిసిందోచ్ అని చాలా మంది జనాలు ఊపిరి పీల్చుకుంటారు.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు స్థానాల్లోనే బీఆర్‌ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఆయా పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి.
చెదురమదురు హింసాత్మక ఘటనల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ఇటు కూటమి పార్టీలు కూడా దీమా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీయే కూటమి అంచనా వేస్తుంటే.. మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై సీఈవో ముకేష్ కుమార్ మీనా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నమోదైన పోలింగ్ వివరాలతో పాటు ఆరోజున రాష్ట్రంలో..
ఇటీవల రాజస్థాన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘చొరబాటుదారులు’, ‘ఎక్కువమంది పిల్లలున్న వారు’..
లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల(Secunderabad, Malkajigiri, Chevella) నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజార్టీతో సీట్లు కైవసం చేసుకుంటామని, హైదరాబాద్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
MCP (మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్) మల్టీస్టార్ మహా కూటమి ఎపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతోందన్నారు. 2019లో జగన్‌ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు.
Telangana: సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి ఆహ్లాదం.. ఆనందాన్ని ఇస్తుంది. ప్రతీరోజు ఎంతో కష్టపడుతూ ఉండే మనిషికి సినిమా కొంత రిలీఫ్‌ను ఇస్తుందని చెప్పువచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది సినిమాలకు వెళుతుంటారు. మరి కొంతమంది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్లకు పడుతుంటారు. అయితే ఇటీవల తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాని పరిస్థితి. దీంతో థియేటర్లు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఊహించని షాక్ ఇచ్చింది.
హైదరాబాద్ లోక్‌సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించిన మజ్లిస్ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.