Share News

Hyderabad: హైదరాబాద్‌లో భారీ మెజారిటీపై ‘మజ్లిస్‌’ ధీమా...

ABN , Publish Date - May 15 , 2024 | 11:19 AM

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సరళిని విశ్లేషించిన మజ్లిస్‌ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో భారీ మెజారిటీపై ‘మజ్లిస్‌’ ధీమా...

- పోలింగ్‌ శాతం తగ్గినా.. గెలుపుపై భరోసా

- పోల్‌ మేనేజ్‌మెంట్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసిన మజ్లిస్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సరళిని విశ్లేషించిన మజ్లిస్‌ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. 1984లో మొదటిసారిగా హైదరాబాద్‌(Hyderabad) పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకున్న మజ్లిస్‌ ప్రతీసారి ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది. 1984 నుంచి 1999 వరకు ఆరుసార్లు జరిగిన లోకసభ ఎన్నికల్లో సుల్తాన్‌ సలాఉద్దీన్‌ ఒవైసీ విజయం సాధించగా, ఆ తర్వాత 2004 నుంచి 2019 వరకు నాలుగుసార్లు జరిగిన ఎన్నికల్లో మజ్లిస్‌ అభ్యర్థిగా అసదుద్దీన్‌ ఒవైసీ భారీ మెజారిటీతో గెలిచారు. 2024లో సైతం మరింత మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో ముస్లిం మైనారిటీల గొంతుకగా నిలిచిన అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌(మజ్లిస్)ను ఈసారి ఓడించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి మాధవీలతను ఆయనపై పోటీకి నిలబెట్టింది. మజ్లిస్‌కు చెక్‌పెట్టడానికే తాను రంగంలోకి దిగానని కొన్ని నెలలుగా మాధవీలత సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ స్థానిక బీజేపీ యంత్రాంగాన్ని ఆశించిన స్థాయిలో వినియోగించుకోలేపోయినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. పోలింగ్‌ బూత్‌లలో పార్టీ తరఫున ఏజెంట్‌లను నియమించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొన్నిప్రాంతాల్లో ఏకపక్షంగా పోలింగ్‌ జరిగినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్‌ పార్లమెంట్‌లోనే అత్యల్పంగా 48.48 శాతం ఓట్లు పోల్‌అయ్యాయి. అయినప్పటికీ పోల్‌ అయిన ఓట్లలో 60 నుంచి 70 శాతం వరకు మజ్లిస్‌కే పడినట్లు ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు మజ్లిస్‌ ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. గోషామహల్‌లో బీజేపీ నుంచి రాజాసింగ్‌ ప్రాతినిఽధ్యం వహిస్తున్నారు. మాధవీలతపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బీఆర్‌ఎ్‌సకు కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. అయినప్పటికీ గోషామహల్‌లో ముస్లిం మైనారిటీల ఓట్లన్నీ గంపగుత్తగా మజ్లిస్ కు వస్తాయని ఆ పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు. గోషామహల్‌లో 1,50,207 ఓట్లు పోల్‌ అయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఇదికూడా చదవండి: TS News: త్వరలో ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వకం

ఇక కార్వాన్‌లో పోల్‌ అయిన 1,85,681 ఓట్లలో లక్షా 5వేలకు పైగా మజ్లిస్‌కు వస్తాయని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు. మలక్‌పేట్‌లో పోల్‌ అయిన 1,35,807 ఓట్లలో 80వేలకు పైగా అసదుద్దీన్‌ ఒవైసీకి అనుకూలంగా వస్తాయని మజ్లిస్‌ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడ ముస్లిం మైనారిటీలే కాకుండా మైనారిటీయేతరులు సైతం మజ్లిస్ కు మద్దతుగా నిలిచినట్టు ప్రచారం జరిగింది. ఇక చార్మినార్‌(Charminar)లో పోల్‌ అయిన 1,11,761 ఓట్లలో 80 శాతానికి పైగా మజ్లిస్ కు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక్కడ ప్రత్యర్థి పార్టీలకు ఆశించిన స్థాయిలో ఓటర్ల మద్దతు లభించలేదు. కాగా, బహదూర్‌పురాలో పోలైన 1,63,204 ఓట్లలో లక్షకు పైగా ఓటర్లు మజ్లిస్ కు మద్దతుగా నిలిచినట్టు స్పష్టమవుతోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ అభ్యర్థులు నామమాత్రం. చాంద్రాయణగుట్టలో 1,71,826 ఓట్లలో లక్షా 25వేలకు పైగా మజ్లిస్ కు అనుకూలంగా పోల్‌ అయినట్టు సమాచారం. ఇక్కడ మధ్యాహ్నం వరకు ఒకవర్గానికి అనుకూలం కన్పించగా సాయంత్రం వేళ ఓటింగ్‌కు రాని వారిని గుర్తించి మజ్లిస్‌ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించుకోవడంతో భారీ మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. యాకుత్‌పురాలో మజ్లిస్ కు ధీటుగా ప్రత్యర్థి పార్టీలునప్పటికీ లోకసభ ఎన్నికల్లో సీన్‌మారింది. ఇక్కడ పోల్‌అయిన 1,56,341 ఓట్లలో లక్షకు పైగా ఓట్లు మజ్లిస్‌కు వస్తాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో 2019లో మజ్లిస్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ 5,17,100 ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థిపై 2.82 లక్షల మెజారిటీ సాధించారు. సోమవారం జరిగిన పోలింగ్‌లో 65 శాతానికి పైగా ఓట్లతో మరింత మెజారిటీ సాధించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాయి.

ఇదికూడా చదవండి: Hyderabad: కునుకు లేకుండా పహారా..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 15 , 2024 | 11:19 AM