Home » Lok Sabha Results
కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. అదొక చచ్చిన పాములాంటిదని హేళన చేశారు. ఆ పార్టీ ఇంకెప్పుడూ కేంద్రంలో అధికారంలోకి రాదని.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వ్యంగ్యాస్త్రాలు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు. మోదీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 1,52,513 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత హెచ్‌డీ కుమారస్వామి మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణే గౌడపై 2.84 లక్షల భారీ ఆధిక్యంతో గెలిచారు.
'ఇండియా' కూటమి నేతగా ఉన్న ఎన్‌సీపీ-ఎస్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటికే జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ ఎన్.చంద్రబాబునాయుడుతో మాట్లాడారంటూ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో శరద్‌పవార్ కొట్టివేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గత రికార్డులను బద్ధలుకొట్టడం ఖాయమైంది. మధ్యాహ్నం 3.15 గంటలకు ఈసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలుపు ఖాయమంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ గెలుపు దాదాపు ఖాయం కావడంతో ఆయన తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా 'అడ్వాన్స్ గ్రీటింగ్స్' చెప్పారు. ''కిషోరి భాయ్... మీ గెలుపు ఖాయమని నాకు ముందే తెలుసు'' అంటూ ట్వీట్ చేశారు.
లైంగిక వేధింపుల కేసులో తీవ్ర సంచలనం సృష్టించిన జేడీఎస్ నేత, హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణకు గట్టి దెబ్బ తగిలింది. హసన్ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్ చేతిలో ఓటమిని చవిచూశారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభంజనం దిశగా వెళ్తోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం దాదాపు కూటమి 150కి పైగా శాసనసభ నియోజకవర్గాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకుంది. ప్రధానంగా ఉరవకొండ సెంటిమెంట్‌ను ఈ ఎన్నికలు బ్రేక్ చేశాయి.