Share News

AP Elections Results: ఏపీలో సైకిల్ ప్రభంజనం.. ప్రజల దెబ్బకు విరిగిన ఫ్యాన్ రెక్కలు..

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:30 AM

ఏపీలో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభంజనం దిశగా వెళ్తోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం దాదాపు కూటమి 150కి పైగా శాసనసభ నియోజకవర్గాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది.

AP Elections Results: ఏపీలో సైకిల్ ప్రభంజనం.. ప్రజల దెబ్బకు విరిగిన ఫ్యాన్ రెక్కలు..
Chandrababu and Jagan

ఏపీలో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభంజనం దిశగా వెళ్తోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం దాదాపు కూటమి 150కి పైగా శాసనసభ నియోజకవర్గాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది. ఫలితాల సరళి చూస్తుంటే వైసీపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. తెలుగుదేశం పార్టీ 127 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా.. జనసేన 19, బీజేపీ 6 స్థానాల్లో కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థులు 144 స్థానాల్లో పోటీచేయగా.. జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసింది. ప్రస్తుతం ఫలితాల సరళిని చూస్తే వైసీపీ రాయలసీమ జిల్లాల్లోనూ పెద్దగా ప్రభావం చూపించనట్లు స్పష్టమవుతోంది. కడప నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి అధిక్యంలో కొనసాగుతున్నారు. ఓ విధంగా చూస్తే టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.

AP Election Result 2024 Live Updates: టెన్షన్ టెన్షన్.. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్.


వైనాట్ 175 ఫెయిల్..

ఎన్నికల ప్రచారంలో 175 సీట్లలో గెలుస్తామంటూ నినదించిన వైసీపీ ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే పూర్తిగా చతికిలపడినట్లు తెలుస్తోంది. కనీసం 20 సీట్లలో గెలుస్తామా లేదా అనే పరిస్థితిలో వైసీపీ ఉంది. జగన్ మంత్రివర్గంలో కీలక మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాధ్ వంటి మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు.


అభివృద్ధి అజెండాకు ఓట్లు..

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి అజెండాకు ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కనిపించకపోవడంతో సామాన్య ఓటరు తెలుగుదేశం పార్టీ కూటమి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకున్న జగన్... ప్రజల విశ్వాసం పొందడంలో వైఫల్యం చెందినట్లు తెలుస్తోంది. అతి విశ్వాసమే జగన్‌ కొంపముంచినట్లు తెలుస్తోంది. మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తే వైసీపీకి ఓట్లు వేయాలని జగన్ కోరగా.. తమ ఇంట్లో మంచి జరగలేదని ప్రజలు తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది.


రాజధాని అంశం..

ఏపీలో మూడు రాజధానులపై ప్రజలు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లపాటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటంపై ఓటరు కోపంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు విశాఖను రాజధాని చేస్తామన్న వైసీపీకి అక్కడి ప్రజలు ఓట్లు వేయలేన్నట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని టీడీపీ కూటమి చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించినట్లు తెలుస్తోంది.


Lok Sabha Election Results 2024 Live Updates: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 02:46 PM