Home » Lucknow Super Gaints
భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
యువ బౌలర్ యశ్ ఠాకూర్ ఓ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్‌గా అవతరించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ipl 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు నాలుగో మ్యాచ్(4th Match) మొదలు కానుంది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్ల మధ్య రాజస్థాన్ జైపూర్(jaipur)లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ పోరు జరగనుంది.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానున్న వేళ లక్నోసూపర్ జెయింట్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ మార్కు వుడ్ దూరం కావడంతో లక్నో ఇబ్బందుల్లో పడింది. తాజాగా మరో ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీ కూడా దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో డేవిడ్ విల్లీ ఐపీఎల్ తొలి భాగం నుంచి తప్పుకున్నాడు.
Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోసూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం లక్నోకు మెంటార్‌గా ఉన్న గంభీర్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే గౌతీ తన మాజీ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరనున్నాడు. రానున్న ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు గంభీర్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో మినీ వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. దీంతో జట్టుకు అవసరం లేని ఆటగాళ్లను వదిలించుకుని వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు ముగ్గురు ఆటగాళ్లను తప్పించనుంది. దీపక్ హుడా, అమిత్ మిశ్రా, కరుణ్ నాయర్ స్థానాలలో టాలెంట్ ఉన్న ప్లేయర్లను తీసుకుని వచ్చే ఏడాది ఛాంపియన్‌గా నిలవాలని లక్నో సూపర్ జెయింట్స్ తహతహలాడుతోంది.
ఐపీఎల్2023లో క్వాలిఫయర్-2కు ముంబై ఇండియన్స్ అర్హత సాధించింది. చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
ఐపీఎల్-2023లో (IPL2023) క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాలంటే తప్పక గెలవాల్సిన లక్నో సూపర్ జెయింట్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ (Lucknow Super Giants vs Mumbai Indians) ఫర్వాలేదనిపించారు.
ఐపీఎల్ 2023లో (IPL2023) గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) జైత్రయాత్ర కొనసాగుతోంది. విజయాల పరంపరలో దూసుకెళ్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్నో సూపర్. జెయింట్స్‌పై (Lucknow Super Giants) మరో గెలుపును సొంతం చేసుకుంది.
సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రెచ్చిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) బౌలర్లలో గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు.