Share News

IPL 2024: లక్నోసూపర్ జెయింట్స్‌కు గంభీర్ గుడ్ బై.. తర్వాతి సీజన్‌లో ఏ జట్టులో చేరనున్నాడంటే..?

ABN , First Publish Date - 2023-11-22T13:52:02+05:30 IST

Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోసూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం లక్నోకు మెంటార్‌గా ఉన్న గంభీర్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే గౌతీ తన మాజీ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరనున్నాడు. రానున్న ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు గంభీర్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.

IPL 2024: లక్నోసూపర్ జెయింట్స్‌కు గంభీర్ గుడ్ బై.. తర్వాతి సీజన్‌లో ఏ జట్టులో చేరనున్నాడంటే..?

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోసూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం లక్నోకు మెంటార్‌గా ఉన్న గంభీర్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే గౌతీ తన మాజీ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరనున్నాడు. రానున్న ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు గంభీర్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా గంభీరే తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తనకు అవకాశం ఇచ్చిన లక్నో యాజమాన్యానికి ధన్యావాదాలు చెబుతూ గౌతం గంభీర్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘లక్నో సూపర్ జెయింట్స్‌తో నా అద్భుతమైన ప్రయాణం ముగిసిందని ప్రకటిస్తున్నాను. నా ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్‌కు ధన్యావాదాలు. నాకు మద్దతుగా నిలిచిన ఫ్రాంచైజీ యజమాని డా.సంజీవ్ గోయెంకాకు కృతజ్ఞతలు. జట్టు భవిష్యత్‌లో అద్భుతాలు చేస్తుందని, ప్రతి ఒక్క ఎల్‌ఎస్‌జీ అభిమాని గర్వపడేలా చేస్తుందని భావిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఎల్‌ఎస్‌జీ బ్రిగేడ్’’ అని గౌతీ ట్వీట్ చేశారు.


కాగా గంభీర్ మెంటార్‌గా ఉన్న రెండేళ్లు కూడా లక్నోసూపర్ జెయింట్స్ జట్టు క్వాలిఫైయర్స్ రౌండ్‌కు అర్హత సాధించింది. 2022, 2023 రెండు సీజన్లలో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అలాగే మరో ట్వీట్‌లో తాను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి తిరిగొచ్చానని చెబతూ ఆ జట్టు జెర్సీ వేసుకున్న తన ఫోటోను గంభీర్ పోస్ట్ చేశాడు. ‘‘నేను తిరిగొచ్చాను. నేను ఆకలితో ఉన్నాను. నా నంబర్ 23. అమి కేకేఆర్’’ అని రాసుకొచ్చారు. గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో తిరిగి చేరడం పట్ల ఆ జట్టు యజమాని షారూక్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘గౌతమ్ ఎప్పుడూ మా కుటుంబంలో భాగమే. మా కెప్టెన్ మెంటర్‌గా వేరే అవతార్‌లో ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతను చాలా మిస్ అయ్యాడు. ఇప్పుడు అందరం చందు సర్ కోసం ఎదురుచూస్తున్నాము. కేకేఆర్‌తో మ్యాజిక్ క్రియేట్ చేయడంలో గౌతమ్ క్రీడాస్ఫూర్తిని నిలబెట్టారు." అని అన్నారు. కాగా కోల్‌కతా నైడ్ రైడర్స్‌కు చాలా కాలంపాటు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతం గంభీర్ రెండు సార్లు జట్టుకు ట్రోఫీ కూడా అందించాడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైడ్ రైడర్స్ జట్టు 2012, 2014లో ట్రోఫి గెలిచింది.

Updated Date - 2023-11-22T14:11:58+05:30 IST