IPL 2024: ముగ్గురు భారత ఆటగాళ్లకు చెక్ పెట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్
ABN , First Publish Date - 2023-07-05T16:48:31+05:30 IST
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో మినీ వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. దీంతో జట్టుకు అవసరం లేని ఆటగాళ్లను వదిలించుకుని వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు ముగ్గురు ఆటగాళ్లను తప్పించనుంది. దీపక్ హుడా, అమిత్ మిశ్రా, కరుణ్ నాయర్ స్థానాలలో టాలెంట్ ఉన్న ప్లేయర్లను తీసుకుని వచ్చే ఏడాది ఛాంపియన్‌గా నిలవాలని లక్నో సూపర్ జెయింట్స్ తహతహలాడుతోంది.
ఐపీఎల్ 2022లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండు సీజన్‌లలోనూ ప్లే ఆఫ్స్‌కు చేరింది. అయితే టైటిల్ సాధించడంలో మాత్రం విఫలమైంది. గత ఏడాది ప్లే ఆఫ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది. ఈ ఏడాది ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇప్పటి నుంచే వచ్చే సీజన్‌పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ముగ్గురు భారత ఆటగాళ్లపై వేటు వేసేందుకు సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ జీతం ఎంతో తెలుసా?
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో మినీ వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. దీంతో జట్టుకు అవసరం లేని ఆటగాళ్లను వదిలించుకుని వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు ముగ్గురు ఆటగాళ్లను తప్పించనుంది. ఈ ఏడాది దారుణంగా విఫలమైన దీపక్ హుడాకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అతడు ఐపీఎల్ 2023 సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 7.64 సగటుతో 84 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడ వచ్చినా దీపక్ హుడా రాణించలేకపోయాడు.
అటు ఈ ఏడాది అంతగా ప్రభావం చూపని సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రాను కూడా వదులుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ భావిస్తోంది. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అమిత్ మిశ్రా 7 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. దీంతో మిశ్రా స్థానంలో యువ స్పిన్నర్‌ను తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడని కరుణ్ నాయర్‌కు కూడా ఉద్వాసన పలకాలని లక్నో ఫిక్స్ అయ్యింది. అతడు దేశవాళీ క్రికెట్‌లో కూడా రాణించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపక్ హుడా, అమిత్ మిశ్రా, కరుణ్ నాయర్ స్థానాలలో టాలెంట్ ఉన్న ప్లేయర్లను తీసుకుని వచ్చే ఏడాది ఛాంపియన్‌గా నిలవాలని లక్నో సూపర్ జెయింట్స్ తహతహలాడుతోంది.