Home » Macherla
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల రిజల్ట్స్(Andhra Pradesh Election Results) కంటే.. మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(MLA Pinnelli Ramakrishna Reddy) ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? పోలీసుల కళ్లుగప్పి ఇంకెంత కాలం దాచుకోగలరు? అసలు ఆయనను రక్షిస్తోంది ఎవరు? ఆయనకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఇలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవున్నాయి.
Bail to Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పునిచ్చింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేసింది హైకోర్టు. అయితే, పలు షరతులు విధించింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ..
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాల అరాచకాలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై పాశవికంగా దాడిచేసి గాయపరిచారు. ‘మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా టీడీపీకి ఓట్లు వేస్తారా.. మీరు వార్డులో ఎలా ఉంటారో చూస్తా.. మిమ్మల్ని అందరినీ చంపేస్తా.. నా పేరే మసి.. నాతో పెట్టుకుంటే మసై పోతారు..’ అని వైసీపీకి చెందిన రౌడీ ఉప్పుతోళ్ల వెంకటేష్ అలియాస్ మసి శనివారం రాత్రి రెచ్చిపోయాడు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎన్నికల రోజు తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా పాల్పడిన అకృత్యాల గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు నోముల మాణిక్యరావును పోలీసులు ఫిర్యాదు స్వీకరించకుండా వేధింపులకు పాల్పడ్డారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత మాణిక్యరావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు. ఈ విషయంపై మాణిక్యరావు ఆదివారం ఏబీఎన్‌తో తన ఆవేదనను పంచుకున్నారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకురాలేదు. ఓవైపు రామకృష్ణారెడ్డి తప్పించుకుతిరుగుతుంటే.. మరోవైపు ఆయన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడి ్డ ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు! నరసరావుపేట దాటి కాలుకదపొద్దు.
మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) ఏపీ హైకోర్టులో(AP High Court) భారీ షాక్ తగిలింది. ఆయన కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడదని ఆదేశాలు జారీ చేసింది.