Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!
ABN , Publish Date - May 26 , 2024 | 11:42 AM
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.
అమరావతి: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, (pinnelli ramakrishna reddy) ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తొలుత కేసు ఫైల్ చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సీఐ నారాయణ స్వామి స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసింది. తనపై దాడి చేసింది పిన్నెల్లి బ్రదర్స్ అని స్టేట్‌మెంట్ ఇవ్వడంలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే..?
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పిన్నెల్లి బ్రదర్స్ దాడి చేయబోయారు. అక్కడే ఉన్న సీఐ నారాయణ స్వామి అడ్డుకున్నారు. దాంతో రాళ్ల దాడి చేయడంతో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. స్పృహ వచ్చిన తర్వాత జరిగిన విషయం సిట్ అధికారులకు వివరించారు. దాంతో పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
మరో హత్యాయత్నం కేసు
పాల్వాయి గేట్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ శేషగిరిరావుపై పిన్నెల్లి సోదరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పుడు మరో హత్యాయత్నం కేసు ఫైల్ చేశారు. పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ఇంతలో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించడంతో జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ పిన్నెల్లి ఇప్పటికీ బయటకు రాలేదు.