Pinnelli Brothers: పిన్నెల్లిని కాపాడుతోంది తెలంగాణకు చెందిన ఆ నాయకుడేనా!?
ABN , Publish Date - May 28 , 2024 | 12:19 PM
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల రిజల్ట్స్(Andhra Pradesh Election Results) కంటే.. మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(MLA Pinnelli Ramakrishna Reddy) ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? పోలీసుల కళ్లుగప్పి ఇంకెంత కాలం దాచుకోగలరు? అసలు ఆయనను రక్షిస్తోంది ఎవరు? ఆయనకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఇలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవున్నాయి.
మాచెర్ల, మే 28: ఏపీ రాజకీయాల్లో ఎన్నికల రిజల్ట్స్(Andhra Pradesh Election Results) కంటే.. మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(MLA Pinnelli Ramakrishna Reddy) ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? పోలీసుల కళ్లుగప్పి ఇంకెంత కాలం దాచుకోగలరు? అసలు ఆయనను రక్షిస్తోంది ఎవరు? ఆయనకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఇలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవున్నాయి. పెద్ద పెద్ద క్రిమినిల్స్‌ను ఎంతో సునాయాసంగా పట్టుకున్న పోలీసులు.. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అసలు దీని వెనుక ఏం నడుస్తోంది. పిన్నెల్లికి తెలంగాణ రాజకీయ నాయకులు ఆశ్రయం ఇచ్చారా? పిన్నెల్లికి పోలీసులు సహకరిస్తున్నారా? ప్రత్యేక కథనం మీకోసం..
పాల్వాయ్ గేట్ గ్రామంలో ఈవీఎం ధ్వంసం కేసులో మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఈసీ ఆదేశించడమే ఆలస్యం.. రాత్రికి రాత్రే పరారయ్యాయి. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్లారనేది మాత్రం తెలియడం లేదు. అయితే, మాచెర్ల నుంచి తప్పించుకుని రావడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని ఓ ఐజీ సాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ అధికారే పిన్నెల్లికి అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు చెబుతున్నారు.
ఐజీ స్థాయి అధికారి.. పిన్నెల్లికి అన్ని విధాలుగా అండగా ఉన్నారని పోలీస్ వర్గాల్లోనే ఆఫ్‌ది రికార్డ్ చెబుతున్నారు. పోలీసుల వ్యూహాలేంటో ఎప్పటికప్పుడు పిన్నెల్లికి చేరవేస్తున్నారట. అంతేకాదు.. పిన్నెల్లిని వెంటాడుతున్న పోలీసు బృందాలను కూడా ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లి అజ్ఞాతంలో ఉన్నాడనే కారణంగా పోలీసులు సైతం కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతటినీ పరిశీలిస్తున్న విపక్ష నాయకులు.. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. పోలీస్ వర్గాలు ఇప్పటికీ పిన్నెల్లి బ్రదర్స్ చెప్పుచేతల్లోనే ఉన్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి అరాచకాలు వీడియోలతో సహా బయటపడినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలీసులను వారు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణకు చెందిన నాయకుడి రక్షణ..
ఇదిలాఉంటే.. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి మీదుగా బీదర్ వైపు వెళ్లారని మొదట్లో ప్రచారం జరిగింది. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే పిన్నెల్లి కారును, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి మాత్రం పరార్ అయినట్లు చెప్పారు. అయితే, తెలంగాణకు చెందిన కీలక నాయకుడొకరు ఆయనకు అండగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఆ నాయకుడే ఆశ్రయం కల్పించారని.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎవరికీ చిక్కకుండా పోయిన పిన్నెల్లికి.. ఆ నాయకుడే అన్నీ తానై అండగా నిలిచినట్లు పొలిటిల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
హైకోర్టులో బెయిల్ పిటిషన్..
ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై దాదాపు పదికి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఇతర కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయనపై రెండు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మంగళవారం నాడు తీర్పు వెలువడే అవకాశం ఉంది.
పిన్నెల్లి అనుచరుల ఆందోళన..
మరోవైపు పిన్నెల్లి బ్రదర్స్ అనుచరులు ఆందోళనలో ఉన్నారు. కేసులకు భయపడి వారే పారిపోతే.. తమ పరిస్థితి ఏంటని పిన్నెల్లి బ్రదర్స్ అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మాచెర్ల పరిధిలో ఆయన ప్రధాన అనుచరలంతా పరారీలో ఉన్నారు. రెండు రోజులుగా పిన్నెల్లి బ్రదర్స్ అనుచరులెవరూ నియోజకవర్గంలో కనిపించడం లేదు. వారిపై నమోదైన కేసులకు భయపడే వారంతా పారిపోయినట్లు తెలుస్తోంది.