Home » Machilipatnam
గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలను వేధించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఉంటాయని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్వం చేసి వారికి ఇష్టమెుచ్చినట్లు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 35రోజులు గడిచినా రాష్ట్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నేతల మాటలు కోటలు దాటాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 35రోజులు గడిచినా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మగ శిశువును మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ మహిళను పట్టుకుని శిశువును కన్న తల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే.
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కమిషనర్ జి.చంద్రయ్యకు కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష పడింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానాకు హైకోర్టు విధించింది.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన దిశగా స్థానిక శాసన సభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర అడుగులు వేస్తున్నారు.
కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయిన వాలంటీర్లు ఇప్పుడు గోసపడుతున్నారు. వైసీపీని గుడ్డిగా నమ్మి తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నామే అని వాపోతున్నారు. తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. మళ్లీ ఉద్యోగాలిస్తే.. ప్రజా సేవ చేసుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నారు.
కృష్ణాజిల్లా: కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. జనసైనికులు కూడా ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని కోరారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.