Share News

Gold Fraud: బ్యాంకులో రూ. 1.70 కోట్ల విలువైన నగల మాయంపై బాధితుల ఆందోళన..

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:06 AM

ఓ ప్రముఖ బ్యాంకులో పెట్టిన ఖాతాదారుల గోల్డ్ నగలు రోల్డ్ గోల్డ్‌గా మారిపోయాయి. ఆ క్రమంలో ఏకంగా రూ. 1.70 కోట్ల విలువైన నగలు మాయమయ్యాయి. ఖాతాదారుల తనిఖీతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Gold Fraud: బ్యాంకులో రూ. 1.70 కోట్ల విలువైన నగల మాయంపై బాధితుల ఆందోళన..
Fraud Machilipatnam Karnataka Bank

మచిలీపట్నం(Machilipatnam)లోని కర్ణాటక బ్యాంకు(Karnataka Bank)లో భారీ మోసం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాంకులో శుక్రవారం గోల్డ్ స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు పెట్టి, రూ. 1.70 కోట్లు విలువైన నగలను కాజేశారు. ఈ మోసం ఘటనలో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సోమశేఖరరావు, ఇంకొంత మంది సిబ్బంది పాలుపంచుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే బ్యాంకులో భద్రపరిచిన నగలు రోల్డ్ గోల్డ్‌గా ఎలా మారాయి, వాటిని ఎలా కొట్టేశారనే దానిపై ఆరా తీయనున్నారు. ఆ క్రమంలో బ్యాంకులో పనిచేసిన ఉద్యోగులందరినీ కోర్టు ముందు తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.


మోసం ఎలా జరిగిందంటే..

అయితే దాదాపు రూ. 1.70 కోట్లు విలువైన గోల్డ్ బ్యాంకులో భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఈ నగలు పదిరోజుల క్రితం రోల్డ్ గోల్డ్ నగలతో మార్చినట్లు తెలుస్తోంది. మలిచిపట్నం బ్యాంకులోని శ్రీవిద్యాధర్ అనే ఖాతాదారుడు తన నగల జమబాక్స్‌ని తెరిచినపుడు వాటి స్థానంలో పెద్ద వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఆ క్రమంలో అసలు నగల స్థానంలో ఉండాల్సిన పసిడి బంగారు నగలు రోల్డ్ గోల్డ్ నగలుగా మారిపోయాయి. దీంతో బ్యాంకు సిబ్బందితోపాటు ముఖ్యంగా అసిస్టెంట్ మేనేజర్ సోమశేఖరరావుపై అనుమానాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది.


ఇతర బ్యాంకుల్లో కూడా ఇదే తరహా మోసాలు?

ఈ తరహా మోసాలు గత కొన్ని రోజుల నుంచి మచిలీపట్నంలోని కొన్ని ఇతర బ్యాంకుల్లో కూడా సంభవించాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, అవి ఇంకా దొరకలేదని బాధితులు వాపోతున్నారు. మోసానికి గురైన ఖాతాదారులు, తమ నగలను తిరిగి పొందలేకపోవడంతో వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.


పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై పోలీసు శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే బ్యాంకులోని సిబ్బందిని ప్రశ్నించామని చెబుతున్నారు. నగలు ఎలా మార్చడం జరిగిందో, అసిస్టెంట్ మేనేజర్‌ సోమశేఖరరావు ఇందులో పాత్ర ఉందో తెలుసుకోవాలన్న దిశలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారిని త్వరలో అరెస్టు చేసి కట్టుదిట్టంగా శిక్ష విధించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

Budget 2025 Latest News: బడ్జెట్‌లో హైలెట్స్..


Chandrababu Naidu: నేడు అన్నమయ్యజిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. కారణమిదే..


సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్

ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 11:06 AM